ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌జ‌లు నానా తంటాలు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు వేల మంది ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక బాధితులు ల‌క్ష‌ల్లో ఉన్నారంటే.. ఈ ర‌క్క‌సి ఏ స్థాయిలో విజృంభిస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చినట్టు... అయింది మందుబాబుల ప‌రిస్థితి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో అత్యవసర సేవలు మినహా అన్నీ బందయ్యాయి. బార్లు, వైన్స్‌లు సైతం బంద్ కావడంతో మందుబాబులు విలవిలలాడిపోతున్నారు.

 

ఏదో ఒక్కరోజు జనతా కర్ఫ్యూ అనుకోని ఎవ్వరూ కూడా మందు కొని నిల్వ చేసుకోలేదు. కానీ ఆ జనతా కర్ఫ్యూను అమాంతం 21 రోజుల పాటు లాక్‌డౌన్ చేయ‌డంతో మందుకొట్టి కిక్కుమీదండే మందుబాబులకు ఇప్పుడు చక్కమందుకూడా దొరకడంలేదు. దీంతో వారికి పిచ్చెక్కిపోతోంది. కొందరు మందుబాబులు మతిస్థిమితం కోల్పోతున్నారు. దీంతో ఇలాంటి వారిని 1000 మందికిపైగా వ్యక్తులను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. ఇక కొంద‌రు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే.. మ‌రికొంద‌రు కిక్కు కోసం ఏవేవో తాగేసి.. ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు.

 

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల పుదుకొట్టాయ్‌లో కూల్ డ్రింకుల్లో షేవింగ్ లోషన్ కలిపి తాగి... ముగ్గురు చనిపోయారు. తాజాగా చెంగల్పట్టు జిల్లాలో మరో ముగ్గురు చనిపోయారు. మద్యం దొరకట్లేదన్న ఉద్దేశంతో వీళ్లు.... కూల్ డ్రింకుల్లో పెయింట్ వార్నిష్ కలిపి తాగారు. అది పాయిజన్‌గా మారి ప్రాణాలు తీసింది. వాస్త‌వానికి మద్యానికి అలవాటు పడిన వారికి పెయింట్ వార్నిషింగ్, షేవింగ్ లోషన్ వంటి వాటి వాసన బాగా నచ్చుతుంది. అందుకే వారు వాటిని నీటిలో, కూల్ డ్రింక్స్‌లో కలుపుకొని అదే మద్యంలా ఫీలవుతూ తాగుతున్నారు. దీంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఎవరైనా మద్యం దొరక్క వింతగా ప్రవర్తిస్తుంటే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తే చికిత్స అందించాలంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: