క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి తీవ్రత దేశ‌వ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతోంది. సోమవారం ఉద‌యానికి కరోనా బాధితుల సంఖ్య దేశ‌వ్యాప్తంగా 4,067కు చే రింది. వీరిలో 109 మంది వైర‌స్ బారిన ప‌డి మ‌రణించ‌గా, 3666 మంది ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు. మ‌రో 292 మంది ద‌వాఖాన‌ల నుంచి డిశ్చార్జి అ య్యారు. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ రోజు ఒంటి గంట‌కు కేంద్ర కేబినెట్ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానుంది.  మ‌ధ్యాహ్నం 12 గంట‌కు కేంద్ర మంత్రుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. రోజు రోజుకూ చాప‌కింద నీరులా విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై ప్ర‌ధాని మోడీ మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు. ఈ మేర‌కు ప‌లు రాష్ట్రాల బాధ్య‌త‌ల‌ను కేంద్ర మంత్రుల‌కు అప్ప‌గించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. క‌రోనా వైర‌స్‌ను క‌ట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు,  లాక్‌డౌన్ అమలు ప‌ర్య‌వ‌సానాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: