ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇంట్లో లైట్లు అన్నీ ఆఫ్ చేసి కొవ్వొత్తులు, దీపాలు, ఫ్లాష్ లైట్లు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చారు. దీంతో దేశంలోని 130 కోట్ల ప్రజలంతా నిన్న రాత్రి 9 గంటలకు కరోనా వైరస్ పై పోరుకు స్పూర్తినిస్తూ ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించి దేశ సత్తా చాటారు.. 

 

అయితే మరికొందరు మాత్రం అతి చేసి.. ప్రధాని మోదీ చెప్పిన దీపాలు వెలిగించకుండా 6 నెలల ముందే దీపావళి పండుగ వచ్చినట్టు టపాకాయలు కాల్చారు.. ఇష్టం వచ్చినట్టు కాల్చి ఒక ఇల్లునే తగలబెట్టారు.. రోడ్లపైకి వచ్చి పెద్ద పెద్ద మంటలు వేస్తూ టపాకాయలు  కాల్చి హంగామా చేశారు. దీంతో ఈ టపాకాయల వల్ల భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. 

 

దీనిపై మహిమ సింగ్ ప్రతాప్ అనే జర్నలిస్ట్ ట్విట్ చేస్తూ.. '' మోదీ పిలుపునిచ్చిన 9 గంటలకు తొమ్మిది నిమిషాల దీపాలకు బదులు టపాకాయలు పేల్చారు.. దీంతో మా నివాసం పక్కన భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.. అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తుంది.. ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా ఉంటారని ఆశిస్తున్నాను.'' అంటూ అయన ట్విట్ చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనే విషయాన్నీ మాత్రం వెల్లడించలేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: