ఒక్క వ్యక్తి ఇచ్చిన విందు ఇపుడు వేలాది మందిలో టెన్షన్ పెంచేస్తోంది. మధ్యప్రదేశ్ లోని మురేనా నగరానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్ లోని ఓ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. ఆతని తల్లి చనిపోయింది. అందుకోసం మార్చి 17వ తేదీన మురేనాకు వచ్చి అంత్యక్రియలు జరిపించాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే 20వ తేదీన అందరికీ ఓ విందు ఇచ్చాడు. ఆ విందుకు సుమారు 1200 మంది హాజరయ్యారు. ఇదే ఇపుడు అందరి కొంపా ముంచేయబోతోంది.

 

మార్చి 27వ తేదీ ప్రాంతంలో ఆ వ్యక్తికి జ్వరం లక్షణాలు కనిపించగానే ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకున్నాడు. వెయిటర్ ను పరీక్షించిన డాక్టర్లు వివరాలు సేకరించారు. దాంతో అతను దుబాయ్ నుండి వచ్చానిట్లు చెప్పాడు. వెంటనే అతనికి వైద్యులు కరోనా వైరస్ టెస్టు కూడా చేశారు. దాంతో అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

 

వెంటనే అతని భార్యను కూడా ఆసుపత్రికి పిలిపించి టెస్టులు చేస్తే ఆమెకు కూడా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇంకేముంది ఆసుపత్రి వర్గాలు జిల్లా యంత్రాంగానికి సమాచారం పంపించారు. దాంతో యంత్రాంగం వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగటంతో అసలు విషయం బయటపడింది. తల్లి చనిపోవటం, తాను దుబాయ్  నుండి రావటం తర్వాత 1200 మందికి విందు ఇవ్వటం అంతా చెప్పేశాడట.

 

ఇంతలో మరో పదిమంది ఆసుపత్రికి వచ్చారు ఒంట్లో బాగోలేదని. వాళ్ళకి పరీక్షలు చేయిస్తే వాళ్ళకి కూడా వైరస్ ఉందని తేలింది. విషయం ఆరాతీస్తే ఆ పదిమంది కూడా దుబాయ్ వెయిటర్ ఇచ్చిన విందులో పాల్గొన్న వాళ్ళే అని తేలింది. వెంటనే విందులో పాల్గొన్న 1200 మంది వివరాలు సేకరించి అందరినీ యంత్రాంగం కిలిసింది. వీళ్ళని కాంటాక్టు చేసిన తర్వాత వాళ్ళంతా ఎక్కడెక్కడ తిరిగింది ? ఎవరెవరిని కలిశారనే వివరాలను కూడా సేకరించారు. వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం మొత్తం 26 వేలమంది లెక్క తేలారు. అందరినీ అధికారులు ఇళ్ళకే పరిమితం చేసి క్వారంటైన్ చేసి పరీక్షలు చేయిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: