భార‌త్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఎలాగైనా ఈ మ‌హమ్మారిని క‌ట్ట‌డి చేయాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మూకుమ్మ‌డిగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 14 వ‌ర‌కు విధించిన  ఈ లాక్‌డౌన్ కార‌ణంగా దేశ ప్ర‌జ‌లంతా కూడా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. అయితే లాక్‌డౌన్ ఎత్తివేసే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. మ‌రి కొద్ది రోజుల్లోనే లాక్ డౌన్ ఎత్తేస్తార‌ని అంద‌రూ భావిస్తున్నారు. కానీ రోజు రోజుకూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో లాక్ డౌన్ ఎత్తివేత‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. లాక్ డౌన్ కార‌ణంగా క‌రోనా వైర‌స్ ను క‌ట్ట‌డి చేశారునుకుంటున్న స‌మ‌యంలోనే ఢిల్లీలోని మ‌ర్క‌జ్ ప్రార్ధ‌న‌ల‌కు హాజ‌రైన వారి వ‌ల్ల రోజు రోజుకూ కేసుల సంఖ్య మ‌రింత పెరుగుతున్నాయి. దీంతో  వైర‌స్ నివార‌ణ‌కు లాక్ డౌన్‌ను  ఈనెల 30 వ‌ర‌కు పొడిగించే ఛాన్స్ ఉన్న‌ట్లు స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: