ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌పై ప్ర‌పంచంలోని అన్ని దేశాలు తీవ్ర‌మైన పోరాటం చేస్తున్నాయి. ప్ర‌పంచ దేశాలు ఎన్ని పోరాటాలు చేస్తున్నా ఈ వైర‌స్ మాత్రం ఆగ‌డం లేదు.  రోజు రోజుకు కోరాలు చాస్తూ విజృంభిస్తోంది. సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు చూస్తే 12, 74, 904కు చేరుకుంది. క‌రోనా మ‌ర‌ణాలు ప్ర‌పంచ వ్యాప్తంగా 70 వేల‌కు చేరువ అవుతున్నాయి. ఇక క‌రోనాపై ముందు నుంచి మ‌న‌దేశం ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉంటోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ముందుగానే మేలుకుని అంద‌రిని జాగ్ర‌త్త‌ప‌రిచారు.

 

ఇక గ‌త నెల‌లోనే 22వ తేదీన దేశ‌మంతా జ‌న‌తాక‌ర్ఫ్యూ పాటించాల‌ని పిలుపు ఇచ్చారు. ఈ క‌ర్ఫ్యూ స‌క్సెస్ అయ్యింది. ఇక నిన్న ఆదివారం దేశ‌మంతా దీప‌య‌జ్ఞం చేయాల‌ని కూడా మోదీ పిలుపు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ రోజు మీడియా ముందుకు వ‌చ్చిన మోదీ ముందుగా బీజేపీ 40వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా అంద‌రికి అభినంద‌న‌లు తెలిపారు. పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా బీజేపీ కార్యకర్తలు చాలా కృషి చేసి అనేకమంది జీవితాల్లో వెలుగులు నింపారని, సమాజ సేవ చేస్తున్నారని... పార్టీని బలోపేతం చేయడం కోసం దశాబ్ధాలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 

 

ఇక క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో భారత్‌ నుండి కరోనాను తరిమికొట్టండి అని మోదీ సోష‌ల్ మీడియాలో సందేశం ఇచ్చారు. క్లిష్ట స‌మ‌యాల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాలో ఎంత ఓర్పుతో ఉండాలో భార‌త్ వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌ర్శంగా నిలిచింది. క‌రోనాపై భార‌త పోరాటాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా మెచ్చుకుంద‌ని మోదీ అన్నారు. ఇప్పటి వరకు భారత్‌లో 4200 కరోనా కేసులు నమోదు కాగా, 24గంటల్లోనే 500కు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 12 లక్షలు దాటగా 70,000 మంది వరకు చనిపోయారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: