కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం ఎంతగా వణికిపోతోందో అందరూ చూస్తున్నదే. మిగిలిన దేశాల సంగతి ఎలాగున్నా అగ్రరాజ్యమని చెప్పుకుని అమెరికా మాత్రం అల్లాడిపోతోంది. కంటికి కనబడని శతృవు కరోనా  వైరస్ దెబ్బను తట్టుకోలేక చివకు చేతులెత్తేసింది.  మొత్తం అమెరికా అంతా ఒ ఎత్తైతే న్యూయార్క్ ఒక్కటే ఒక ఎత్తు. అమెరికాలో నమోదైన సుమారు 3 లక్షల కేసుల్లో న్యూయార్క లోనే దాదాపు 1 లక్షదాటిపోయాయి. అలాగే అగ్రరాజ్యంలో చనిపోయిన మొత్తం 9700 మందిలో  న్యూయార్క్ లోనే దాదాపు 3 వేలమందున్నారు.

 

సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే వైరస్ బాధితులను చేర్చుకోవటానికి న్యూయార్క్ లో ఆసుపత్రులు ఎలా లేవో చనిపోయిన వారిని భద్రపరచటానికి మార్చురీలు కూడా లేవట. నగరంలో ఉన్న మొత్తం ఆసుపత్రలు వైరస్  బాధితులతో  ఎలా నిండిపోతోందో మార్చురీలు కూడా మృతదేహాలతో నిండిపోయాయి. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచక అధికారులు చిరవకు ఆసుపత్రుల్లోని వరండాల్లోను, ప్లే గ్రౌండ్లను కూడా చివరకు మార్చురీలుగా మార్చేశారు.

 

అవి కూడా సరిపోకపోవటంతో కొన్ని ఖాళీ భవనాలను తీసుకుని వాటికి ఏసి సౌకర్యాలు ఏర్పాటు చేసి అక్కడ ర్యాకులు ఏర్పాటు చేశారు. ఆ ర్యాకుల్లో డెడ్ బాడీస్ ను జిప్ బ్యాగుల్లో ఉంచి సీల్ చేసి వదిలేస్తున్నారు. ప్రతి బ్యాగుపైనా పేషంట్ తాలూకు వివరాలు అంటిస్తున్నారు. చనిపోయిన తాలూకు కుటుంబసభ్యులు వచ్చినపుడు వాళ్ళకి అడ్రస్ చెప్పి పంపుతున్నారట. మొబైల్ మార్చురీలు కూడా రెడీ చేసి శవాలను అందులో కూడా ఉంచేస్తున్నారు.

 

డెడ్ బాడీస్ ను భద్రపరచటమే ఓ సమస్య అయితే ఆ బాడీలను తీసుకోవటానికి కూడా చాలా చోట్ల కుటుంబసభ్యులు రావటం లేదట. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా వైరస్ బాడీలోనే ఉంటుందని చెప్పటంతో క్రిమేషన్ చేయటానికి కుటుంబసభ్యులు భయపడుతున్నారట. ఒకవైపు పెరిగిపోతున్న రోగులకు వైద్యమే అందించాలా ? మరోవైపు చనిపోయిన వారిని ఎక్కడ భద్రపరచాలో అర్ధంకాక అమెరికాలోని ఆసుపత్రులు, ప్రభుత్వాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: