ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు సేఫ్ జోన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ఇప్పుడు క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి. సోమ‌వారం ఉద‌యంతో క‌రోనా కేసులు ఏకంగా 266కు చేరుకున్నాయి. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం ఉద‌యం ప్రెస్‌మీట్ పెట్టిన మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధ్య‌క్షులు చంద్ర‌బాబు ఏపీ ప్ర‌భుత్వ తీరుపై విరుచుకుప‌డ్డారు. ఏపీలో క‌రోనా టెస్టులు స‌రిగ్గా చేయ‌డం లేదు... ప్ర‌జ‌లు వెంటిలేట‌ర్లు లేక ఇబ్బందులు ప‌డుతున్నారు.. ప్ర‌భుత్వం వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

 

ఏపీ ప్ర‌భుత్వం క‌రోనా విష‌యంలో చాలా నిజాలు దాచేస్తోంద‌ని బాబోరు ఫైర్ అయ్యారు. అస‌లు ఇక్క‌డ ఏ టెస్టులు చేస్తున్నారో ?  కూడా ప్ర‌జ‌ల‌కు అర్థం కాని పరిస్థితి ఉంద‌న్నారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు ఏపీ ప్ర‌భుత్వం స‌రిగ్గా చర్య‌లు తీసుకోవాలి అని ఆయ‌న డిమాండ్ చేశారు. వాస్త‌వాల‌ను దాచిపెట్ట‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని.. వాస్త‌వాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు వివ‌రించి వారిని అప్ర‌మ‌త్తం చేయాల‌ని.. మొబైల్ రైతు బ‌జార్లు ఏర్పాటు చేయాల‌న్నారు. ఈ స‌మ‌యంలో వైద్యుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: