చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన భయంకరమైన వైరస్ కరోనా.. ఇప్పుడు ప్రపంచంలోని 205 దేశాలను ముచ్చెమటలు పట్టిస్తుంది.  కొన్ని దేశాల్లో అయితే మరీ దారుణంగా పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు.  ముఖ్యంగా ఇలటీ, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ అలాంటి అగ్ర దేశాల్లో ఈ కరోనా వైరస్ ప్రభావం తీవ్ర రూపం దాల్చింది.ఇక భారత దేశంలో రోజు రోజుకీ దీని ప్రభావం తీవ్ర రూపం దాల్చుతుంది. మనకు వారం రోజులకు ముందు దీని ప్రభావం పెద్దగా చూపించకున్నా.. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని తబ్లిగీ జమాత్‌ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన ముస్లిం లకు ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని.. వారికి ఎన్ని విధాలుగా చెప్పినా కొంత మంది మాత్రం ట్రీట్ మెంట్ కి రాకుండా ఇతరులకు దీన్ని వల్ల హాని కలిగిస్తున్నారని అంటున్నారు.  

 

ఇదిలా ఉంటే.. క‌రోనా వ్యాధి వ్యాప్తిలో ఆందోళ‌నక‌ర‌మైన మూడో ద‌శ దేశంలో కొన్నిచోట్ల ప్రారంభమైందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా సోమ‌వారం తెలిపారు. ఈ ద‌శ‌లో క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ ద్వారా వైర‌స్ వేగంగా వ్యాపిస్తుంది. ముంబైలాంటి కొన్ని ప్రాంతాల్లో వైర‌స్ వేగంగా వ్యాపిస్తున్న‌ద‌ని, ఇది మూడోద‌శ‌ను సూచిస్తున్న‌ద‌ని గులేరియా తెలిపారు.

 

మొన్నటి వరకు స్టేజ్ 2 లో ఈ కరోనా వైరస్ ఉందని.. ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తిని సమూలంగా నియంత్ర‌ణ చ‌ర్య‌లు తీసుకుంటే ప్రమాదాన్ని నివారించ‌వ‌చ్చ‌ని తెలిపారు. త‌బ్లిగి జ‌మాత్ స‌మావేశాల‌కు హాజ‌రైన‌వారిని త్వ‌ర‌గా గుర్తించ‌టం ఇప్పుడు చాలా ముఖ్య‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విష‌యంలో వైద్యుల‌కు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: