మ‌ర్క‌జ్ నిజాముద్దీన్ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఆధ్యాత్మిక స‌భ‌కు వెళ్లి వ‌చ్చిన వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణానికి చెందిన 21మంది త‌బ్లీగి జ‌మాత్ ప్ర‌తినిధుల‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో జిల్లా అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ప్రైమ‌రీ కాంటాక్టు ద్వారా వైర‌స్ బారినప‌డిన వారి కుటుంబ స‌భ్యుల్లో మ‌రో ఇద్ద‌రికి వ్యాప్తిచెందిన‌ట్లుగా అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. వీరంతా కూడా ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిలోని ఐసోలేష‌న్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా త‌బ్లీగి ప్ర‌తినిధులు ఈనెల 20న వ‌రంగ‌ల్‌లో ప‌లువురిని కలిసి ఢిల్లీ ఆధ్యాత్మిక స‌భ‌లో జ‌రిగిన విశేషాల‌ను వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. 

 

త‌బ్లీగి ప్ర‌తినిధులు ఎక్క‌డ‌క్క‌డా ప‌ర్య‌టించారు..ఎవ‌రెవ‌రిని క‌లిశారు..వారి ఆరోగ్య ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి అనే కోణంలో అధికారులు క‌రోనా చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశారు. ఇదిలా ఉండ‌గా త‌బ్లీగి ప్ర‌తినిధుల‌కు క‌రోనా సోకిన విష‌యాన్ని ప్ర‌భుత్వం దాచిపెట్టింద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  వాస్త‌వానికి ఐదు రోజుల క్రితమే 21మందికి క‌రోనా పాజిటివ్ అయిన‌ట్లుగా అధికార యంత్రాంగానికి తెలిసిన వివరాలు వెల్ల‌డించ‌లేద‌ని మండిప‌డుతున్నారు. వ‌రంగ‌ల్‌లోని మండిబ‌జార్‌, కాశిబుగ్గ‌,  హ‌న్మ‌కొండ‌లోని వ‌డ్డేప‌ల్లి, కాజేపీట‌లోని బాపూజీన‌గ‌ర్‌ను నో మూమెంట్‌జోన్‌గా ప్ర‌క‌టించారు. తాజాగా రంగ‌శాయిపేట‌ను కూడా నో మూమెంట్‌జోన్‌ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చారు. 


సోమవారం రంగశాయిపేటలో  కలెక్టర్ గాంధీతో పాటు పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్ ప‌మేలా సత్పతి ప‌ర్య‌టించి లాక్‌డౌన్ ప‌ర్య‌వేక్షించారు.  ప్రైమ‌రీ కాంటాక్టు ద్వారా వైర‌స్ వ్యాప్తి చెంది ఉంటుంద‌న్న అనుమానాల‌ను అధికారులు వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా అధికారులు వ‌రంగ‌ల్‌లోని ఎంజీఎంతో పాటు ప‌ట్ట‌ణంలోని నాలుగు ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో కూడా  క‌రోనా బాధితుల‌కు వైద్యం అందించేందుకు వీలుగా ఐసోలేష‌న్ వార్డుల‌ను సిద్ధం చేయ‌డం గ‌మ‌నార్హం. క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాల‌తో ఉన్న‌వారు ఎంజీఎం ప్ర‌త్యేక వార్డులో దాదాపు 400మందికి పైగా వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: