భారతీయ ఆయుర్వేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన కాలం నుండి మనందరినీ రోగాల నుండి కాపాడే శక్తి ఆయుర్వేదానికి ఉంది. ప్రస్తుతం ప్రపంచదేశాలన్నిటిని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ని ఎదుర్కొనే సామర్థ్యం కూడా మన ఆయుర్వేదానికి ఉంది. రోగ నిరోధక శక్తి పెరుగుదలలో కీలకమైన పాత్ర వహించే ఆయుర్వేదం( పసుపు, జీలకర్ర, శొంఠిలాంటివి) ఎటువంటి ప్రాణాంతక వైరస్ నైనా అడ్డుకోగలదని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పుకొచ్చారు.


మన పెరటిలో పెంచే తులసి తో పాటు పసుపు పొడి, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఎల్లిపాయలు, నిమ్మ, ఉసిరి వంటివి తరచుగా మన ఆహార వంటలలో వాడడం వలన కరోనా వైరస్ ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల క్రితం తెలియజేయగా... ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సూచనలను ప్రజలందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిపుణులు కూడా ఆయుర్వేదం అనేది మన శరీరంలో ఉన్న మంచి బాక్టీరియా ని బలపరిచి, అలాగే కొత్తగా అధిక సంఖ్యలో మంచి బ్యాక్టీరియా ఉత్పన్నమయ్యేలా చేసి కరోనా వైరస్ ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెబుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే... మన శరీరంలో ఎంత ఎక్కువ మంచి బ్యాక్టీరియా ఉంటే అంత ఎక్కువ శక్తితో మనల్ని మనం వైరస్ల నుండి కాపాడుకోవచ్చు.


ఆహారపు అలవాట్లలో ఆయుర్వేదం ఎంత ముఖ్యమో... జీవనశైలిలో యోగ, మెడిటేషన్, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. ప్రతి రోజు యోగా మెడిటేషన్ వ్యాయామం చేయడం ద్వారా రక్తం శుద్ధి అవుతుంది. ఆక్సిజన్ కూడా శరీరంలోని అన్ని భాగాలకు చాలా చక్కగా అందుతుంది. రోజు ఈ మూడింటిని చేసేవారికి ఎటువంటి రోగమైనా దరిచేరదు. యోగ మెడిటేషన్ వ్యాయామం చేసేవారిలో ముసలి దశలో కూడా రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతైనా చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి... మీ ఆహారంలో ఆయుర్వేదం ఉండేలా చూసుకుని... ప్రతిరోజు ఓ గంటన్నర పాటు వ్యాయామం మెడిటేషన్ యోగా చేయండి. ముఖ్యంగా ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో అరచెంచా పసుపు వేసుకొని ఒకటి, రెండు సార్లు తాగితే రోగనిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: