ప్ర‌తి సంవ‌త్స‌రం ఏప్రిల్ నెలలో వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించి జూన్ వరకూ ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి దేశంలో కోవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రయోజనాల రీత్యా 'సంఘ్ శిక్షా వర్గ' (వేసవి శిక్షణా శిబిరం)ను రద్దు చేస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య తెలిపారు. వేసవి శిక్షణా కార్యక్రమం ఆర్ఎస్ఎస్ నిర్వహించకపోవడం ఇదే మొదటిసారి అని అన్నారు.  సంస్థపై నిషేధం ఎత్తివేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాన్నిఇప్ప‌టివ‌ర‌కు రద్దు చేయలేద‌ని వైద్య తెలిపారు. షెడ్యూల్ ప్రకారం 90 రోజుల పాటు శిక్షణా శిబిరం జరగాల్సి ఉందని, దశల వారిగా లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశం ఉన్నప్పటికీ మే, జూన్‌ మాసాల్లో కూడా శిక్షణా శిబిరాలను నిర్వహించరాదని ఆర్ఎస్ఎస్ నిర్ణయించినట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: