దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఇప్ప‌టికే మొత్తం 109 మంది క‌రోనా దెబ్బ‌తో మృతి చెందారు. దేశంలో ఇప్ప‌టికే క‌రోనా కేసులు 4 వేలు దాటేశాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా విజృంభిస్తోంది. గ‌త 12 గంట‌ల్లోనే 409 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా కేసులు తెలంగాణ‌లో 320 ఉంటే.. ఏపీలో ఇప్ప‌టికే 260 ద‌గ్గ‌ర్లో ఉన్నాయి. ఈ కేసులు గంట గంట‌కు పెరుగుతున్నాయి. ఇక క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఎప్ప‌టిక‌ప్పుడు అలెర్ట్‌గా ఉంటోన్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ నిన్న ఆదివారం ప్ర‌జ‌లు అంద‌రూ 9 నిమిషాల పాటు బ‌య‌ట‌కు వ‌చ్చి దీప‌పుజ్యోతి వెలిగించాల‌ని చెప్పారు.

 

ఇక తాజాగా సోమ‌వారం జ‌రిగిన కేంద్ర కేబినెట్ స‌మావేశంలో మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుక‌న్నారు. ఏకంగా రెండేళ్ల పాటు ఎంపీ నిధుల‌కు బ్రేక్ వేశారు. క‌రోనాపై పోరాటానికి ప్ర‌ధాన‌మంత్రి మోదీ , కేంద్ర మంత్రుల‌తో పాటు ఎంపీల నిధుల్లోనూ ఏకంగా 30 శాతం కోత విధించారు. ఈ నెల నుంచే ఈ నిర్ణ‌యం అమల్లోకి రానుంది. ఇక రెండేళ్ల పాటు ఎంపీ నిధుల‌పై స‌స్పెన్ష‌న్ విధించారు. కోత ద్వారా వ‌చ్చిన సొమ్ము క‌న్సాలిడేట్ ఫండ్‌కు జ‌మ చేయాల‌ని నిర్ణ‌యించారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: