దేశం మొత్తం ఇప్పుడు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ప్రపంచాన్ని గడ్డు పరిస్థితి కి తీసుకు వచ్చింది కరోనా వైరస్.  అగ్ర రాజ్యాలు సైతం ఇప్పుడు ఈ కరోనా పేరు చెబితే భయంతో వణికి పోతున్నారు.  అయితే కరోనా చేస్తున్న కరాళ నృత్యం ఇప్పుడు భారత్ పై కూడా పడుతుంది.  ఈ నేపథ్యంలో భారత దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఎక్కడి వ్యవస్థ అక్కడే ఆగిపోయింది. ఇక ఏపిలో ఆర్థిక వ్యవస్థ గురించి.. కరోనా వైపరిత్యం గురించి ఆమద్య ప్రధాని మోదీ వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఏపి సీఎం జగన్ ఇక్కడ పరిస్థితు గురించి క్షుణ్ణంగా తెలియజేశారు.

 

దాంతో కేంద్రం ఆర్థిక సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ నేతలు మాత్రం కేంద్రం నిధులు పంపితే ఆయన ఏదో ఉద్దరించి ప్రజలను ఆదుకుంటున్నామని వ్యాఖ్యానించారు.  తాజాగా  మెగాబ్రదర్ నాగబాబు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిలను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు.  కేంద్రం రూ.1000 ఇచ్చిందని చెబుతున్నారని, ఇకనైనా కాస్త బుర్ర వాడాలని హితవు పలికారు.

 

కేంద్రం ఇచ్చిన డబ్బు సరాసరి అకౌంట్లో జమ అవుతుందని పేర్కొంటూ, ఓ అకౌంట్లో రూ.500 జమ అయినట్టు బ్యాంకు నుంచి వచ్చిన సందేశం తాలూకు స్క్రీన్ షాట్ ను పోస్టు చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పిచ్చి పచ్చ రాజకీయ అవాస్తవాల ప్రచారం ఆపాలని సూచించారు.  ప్రస్తుతం ఏపిలో కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. లాక్ డౌన్ పాటించాలని కోరారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: