ప్రస్తుతం అటు భారతదేశంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో రాష్ట్ర అధికారులు మరియు వైద్య బృందం చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిన కారణంగా వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా హాస్పిటల్ లో చేరిన పేషెంట్లు ప్రవర్తించే తీరు మరియు వారి నుండి తమకు వైరస్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తల నడుమ వారంతా సందిగ్ధంలో పడ్డారు.

 

తాజాగా గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ సోకిన పేషెంట్ల బంధువులు కొంత మంది వైద్య సిబ్బంది పై దాడి చేసిన ఘటన కూడా వారందరినీ కలవరపరిచింది. అదే కాకుండా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల వివరాలు అడిగి తెలుసుకునేందుకు మరియు హెల్త్ చెకప్ చేయడానికి వెళ్ళినా ఆశా వర్కర్లు మరియు ఎఎన్ఎమ్ నర్సులపై తెలంగాణలో ఇటీవల కొన్ని దాడులు జరగడం కూడా గమనించాం. నేపథ్యంలో వైద్య సిబ్బంది భద్రతపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమై ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

 

తెలంగాణ డిజిపి చేసిన ఒక ప్రకటన మేరకు కరోనా బారిన పడకుండా పని చేస్తున్న డాక్టర్లు, ఆశా హెల్త్ వర్కర్లు, పారా మెడికల్ సిబ్బంది భద్రత కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు డిజిపి ఆదేశాలు జారీ చేశారు. అదే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటల్ లో పనిచేస్తున్న వైద్యుల రక్ష కోసం ప్రాంతంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే పోలీసులను మరియు వైద్యులను కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉండే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చోటా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.

 

గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు డాక్టర్ లతో సంప్రదింపులు జరుపుతూ వారి భద్రతకు కావాల్సిన చర్యలు చేపడతారని డీ.జే.పి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని వైద్యులు, పోలీసులతో కలిపి ప్రత్యేకంగా మెడికల్ వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు కాగా.. నగర పరిధిలోని డాక్టర్లు, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, ఆశా వర్కర్లను కలిపి నోడల్ వాట్సప్ గ్రూపును మొదలుపెట్టామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: