ఈ మద్య ప్రపంచంలో కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు.  అయితే కరోనా నేపథ్యంలో కొన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో చాలా వరకు రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఈ ప్రామాదాల స్థాయిని అరికట్టలేక పోతున్నారు.  కొన్ని రోడ్డు ప్రమాదాలు అనుకోకుండా అదుపు తప్పి జరుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.  తాజాగా ఫిలిప్పీన్స్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు దుర్మరణం చెందారు. వారిద్దరినీ అనంతపురం జిల్లాకు చెందిన వంశీ, రేవంత్ కుమార్ గా గుర్తించారు.

 

ఆ ఇద్దరూ ఫిలిప్పీన్స్ లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు.  వారి మృతదేహాలను స్వస్థలాలకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోపక్క, ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఫిలిప్పీన్స్ లో అనేకమంది తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు. అయితే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. 

 

ఇదిలా ఉంటే కరోనా ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మృత దేహాలను సాధ్యమైనంత వరకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు.  ఇలాంటి విషాదకర పరిస్థితి లో ఈ మరణం కుటుంబ సభ్యులకు తీరని దుఖాఃన్ని మిగిల్చింది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: