భారత దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ పిలుపుమేరకు భారీ స్పందనే వచ్చింది. కరోనాను తరిమికొట్టడంలో మనమంతా ఒక్కటిగా ఉన్నామనే దానికి నిదర్శనంగా అందరూ ఇళ్లలో లైట్లు ఆర్పి బాల్కనీల్లో నిలబడి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.  అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌ల‌రాంపూర్ జిల్లాకు చెందిన బీజేపీ మ‌హిళా మోర్చా నేత మంజూ తివారీ ఆదివారం రాత్రి త‌న భ‌ర్త లైసెన్సు పిస్తోల్‌తో ఫైరింగ్ జ‌రిపింది. ఆ సంఘ‌ట‌న‌ను వీడియో తీసి ఆమె త‌న ఫేస్‌బుక్‌లో పెట్ట‌డంతో.. ఆ వీడియో వైర‌ల్ అయ్యింది.  "దీపాలు వెలిగించిన తరువాత, కరోనాను తరిమేస్తున్నాం" అని ఆయన ఆ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టారు.  

 

ఇంట్లో రాత్రి 9 గంట‌ల‌కు దీపాలు వెలిగించిన త‌ర్వాత ఆమె గ‌న్‌తో ఫైరింగ్ చేసింది.   అయితే దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించి తమ సంఘీభావాన్ని తెలిపిసతే ఆమె మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఇలా గన్ కాల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఆమెపై సీఎం యోగి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు. 

 

 

ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో మంజూ తివారీ క్షమాపణలు చెప్పారు. కాగా, నిన్న నగరమంతా దీపాలు వెలిగించారు. అది ఓ దీపావళిలా అనిపించింది. ఉత్సాహంతో తుపాకీ కాల్చాను. నా తప్పును తెలుసుకున్నాను. క్షమాపణలు చెబుతున్నాను అని ఆమె పేర్కొన్నారు. తప్పు జరిగిపోయిందని వాగ్మూలం ఇచ్చారు.  ప్రస్తుతం బీజేపీ బలరాంపూర్ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఆమె ఉన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: