ఏం జనమో ఏమో.. మన ప్రజలకు బొత్తిగా ఆలోచన లేనట్లుంది.. ఆలోచన ఉందో లేదో తెలియదు గాని చూసి రమ్మంటే కాల్చి వస్తారు.. ఇదంతా అత్యుత్సాహం వల్ల వచ్చిన తంటా.. ఇక కరోనాను తరిమి కొడదాం ఇలా చేయండి అంటే చెప్పింది చేయకుండా.. ఇదేదో సెలబ్రిటీ వస్తుండగా హంగామ చేసినట్లుగా చేస్తున్నారు.. అసలేం జరిగిందంటే..

 

 

కరోనా విషయంలో మన ఐక్యతను చాటేలా అందరు గట్టిగా చప్పట్లు కొడదామని మన ప్రధాని గారు చెబితే.. చాలమంది ఏం చేశారో తెలుసుగా.. జనాలందరు బయటికి వచ్చి వంట సామాగ్రితో పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ నృత్యాలు చేశారు. ఇంతకు ఆ పెద్దాయన చెప్పిందేమిటి, అందరు చేస్తున్న దేమిటి.. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రధాని మోదీ గారు.. నిన్న దీప యజ్ఞానికి పిలుపునివ్వగా, దేశ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ప్రజలంతా ఒక్క తాటి పై నిలబడి సరిగ్గా 9 గంటలకు లైట్లను ఆర్పేసి దీపాలను వెలిగించారు.

 

 

ఇంత వరకు బాగానే ఉంది కానీ కొందరు చూపిన అత్యుత్సాహం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.. ఎవరి ఇంటి ముందు వారు దీపాలు వెలిగించండని చెబితే.. టపాసులు కాల్చడం, కాగడాలు పట్టుకుని ర్యాలీలు తీయడం లాంటి పనులు చేశారు మన ప్రజలు.. ఇక ఇదంతా ఒకెత్తైతే ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌ జిల్లా బీజేపీ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మంజు తివారీ మరింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, రాత్రి 9 గంటలకు దీపం వెలిగించకుండా ఏకంగా గాల్లోకి తుపాకీతో కాల్పులు జరిపారు. కాగా ఆ మహిళ చేసిన పనిని అక్కడ ఉన్న వారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. ఏవమ్మా ఇదేం పని మీరు చేస్తున్నది బాధ్యతగా ఉందా అని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: