ఏపీలో క‌రోనా వీర విహారం చేస్తూ దూసుకుపోతోంది. రాష్ట్రంలో ఈ రోజు కోవిడ్19 పరీక్షల్లో కొత్త గా ప‌లు జిల్లాల్లో కేసులు న‌మోదు అయ్యాయి. తాజాగా ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు విడుద‌ల చేసిన బులెటిన్ ప్ర‌కారం కర్నూల్ లో 18, నెల్లూరు లో 8, పశ్చిమ గోదావరి లో 5, కడప లో 4, కృష్ణ మరియు ప్రకాశం జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 37 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 303  కి పెరిగింది. గ‌త 8 గంట‌ల్లోనే ఏకంగా 37 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ధికంగా క‌ర్నూలు జిల్లాలో ఏకంగా 74 కేసులు న‌మోదు అయ్యాయి. 

 

ఇక నిన్న‌టి వ‌ర‌కు ఏపీలో నెల్లూరు జిల్లా అత్య‌ధిక కేసుల‌తో ముందు ఉండేది. అయితే క‌ర్నూలు జిల్లా ఇప్పుడు అన్ని జిల్లాల‌ను దాటేసి ఏకంగా 74 కేసుల‌తో మిగిలిన జిల్లాల కంటే చాలా ముందు ఉంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 303 మందిలో ఆరుగురు డిశ్చార్జ్ అవ్వ‌గా.. ఇక క‌రోనా సోకి ముగ్గురు మృతి చెందారు. ఇక జిల్లాల వారీగా చూస్తే ప్ర‌కాశం 24, నెల్లూరు 42, విశాఖ 20, ప‌శ్చిమ గోదావ‌రి 21 కేసుల‌తో ఉన్నాయి. ఏదేమైనా 303 కేసులు నమోదు కావ‌డంతో ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉంద‌నే ప్ర‌భుత్వం చెపుతోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: