ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 4 వేల‌కు పైగా కేసులు 110కు పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అమెరికా, స్వీడ‌న్‌, స్పెయిన్‌, ఇట‌లీ లాంటి దేశాలు విల‌విల్లాడుతున్నాయి. ఇక ఏపీలో కూడా రోజు రోజుకు ప‌రిస్థితి దిగజారుతోంది. ఏపీలో సోమ‌వారం సాయంత్రం బులిటెన్ ప్ర‌కారం మొత్తం పాజిటివ్ కేసులు 303కు చేరుకున్నాయి, ఇక వీరిలో ముగ్గురు ఇప్ప‌టికే మృతి చెందారు. ఎక్క‌డికక్క‌డ లాక్‌డౌన్ స్ట్రిక్ట్‌గా అమ‌లు అవుతోంది. 

 

ఇక అటు ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్‌గా ఉండ‌డంతో ప్ర‌జ‌లు కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఇక కొంద‌రు ఎమ్మెల్యేలు స్వ‌యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు ధైర్యం క‌ల్పిస్తున్నారు. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తోన్న వైద్యుల‌తో పాటు అటు పారిశుధ్య కార్మికుల‌కు భ‌రోసా క‌ల్పిస్తున్నారు. అర‌కు ఎమ్మెల్యే అయితే పోలీసుల కాళ్లు క‌డిగారు. ఇక తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లా రాజానగ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా ఏకంగా ప‌రిశుధ్య‌ కార్మికుల పాదాలను కడిగి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. 

 

సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ‌క్కంపూడి మాట్లాడుతూ అత్యంత సంక్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో సైతం ప్ర‌జ‌లు అనారోగ్యం భారిన ప‌డ‌కుండా త‌మ ప్రాణాల‌కు తెగించి మ‌రీ మ‌న‌కోసం ప‌ని చేస్తున్నార‌ని కొనియాడారు. ఇక కార్మికుల కనీసవేతనం రూ. 18 వేలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: