ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకు నిజంగా ఇది అవమానం అనే చెప్పాలి. ఒకపుడు దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పానని తరచూ చెప్పుకుంటాడు. ప్రధానమంత్రులు, లోక్ స్పీకర్, రాష్ట్రపతులను తానే డిసైడ్ చేశానని కూడా చాలా సార్లే చెప్పుకున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి చంద్రబాబు మోడి చేసిన పనికి అవమానంగా ఫీలవుతున్నాడా ? అని ఇపుడందరూ మాట్లాడుకుంటున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నేపధ్యంలో మోడి కొందరికి ఫోన్లు చేసి మాట్లాడాడు. సోనియాగాంధితో పాటు మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, దేవేగౌడ, మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభాపాటిల్ తో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, నవీన్ పట్నాయక్, కేసియార్, జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడారు.   అంతటితో ఆగిపోతే బాగుండేది. కానీ మోడి ఏమి చేశాడంటే తర్వాత మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తో కూడా మాట్లాడారు.

 

సోనియా గాంధి అంటే వేరే సంగతి. మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు కూడా ఓకేనే. ముఖ్యమంత్రులతో మాట్లాడాడంటే కూడా ఏదోరకంగా సరిపెట్టుకోవచ్చు.  మరి మాజీ ముఖ్యమంత్రులతో  కూడా మాట్లాడటంతోనే సమస్య వచ్చింది.  మామూలుగానే తన స్ధాయిని ప్రధానమంత్రి స్ధాయితో  చంద్రబాబు పోల్చుకుంటుంటాడు. ఏ సమస్య వచ్చిన వెంటనే ప్రధానమంత్రులు చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా భజన మీడియాలో పుంఖానుపుంఖాలుగా కతలు రాయించుకున్న విషయం అందరూ చూసిందే.

 

మరి ఇలాంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఫోన్ చేసి మోడి మాట్లాడలేదంటే ఎంతటి అవమానం. పైగా మాజీ ముఖ్యమంత్రులైన తండ్రి, కొడుకులు ములాయంసిగ్ , అఖిలేష్ కు ఫోన్ చేసిన ప్రధానమంత్రి చంద్రబాబును వదిలిపెట్టటమంటే నిజంగా అవమానం క్రిందే లెక్క. ఒకవైపేమో మమతాబెనర్జీ, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు మోడితో దూరంగా ఉంటున్నారు. అలాగే ములాయం, అఖిలేష్ అసలు మోడి ఊసే ఎత్తటం లేదు. అలాంటిది వాళ్ళకి ఫోన్ చేసిన మోడి మళ్ళీ దగ్గరవుదామని తెగ ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబును పట్టించుకోవటం లేదంటే అవమానం క్రిందే లెక్క.

 

మరింత సమాచారం తెలుసుకోండి: