చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ఇండియాలో రోజురోజుకీ బలపడుతోంది. ఈ వైరస్ దెబ్బకు యూరప్ మరియు అమెరికా దేశాలలో తీవ్ర స్థాయిలో పాజిటివ్ కేసులతో పాటు మరణాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అక్కడ వాతావరణం చల్లగా ఉండటంతో ఈ వైరస్ కి బాగా బలం చేకూరి పరిస్థితి ప్రమాదకరంగా లోకి వెళ్లిపోయిందని చాలామంది అంటున్నారు. చల్లగా ఉండే ప్రాంతాలలో కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైన కోణంలో మనిషిపై ప్రభావం చూపుతుందని..అందుకే యూరప్ వంటి దేశాలలో ఈ వైరస్ ప్రభావం గట్టిగా ఉందని చాలా మంది అంటున్నారు. ఇండియాలో కూడా ఈ వైరస్ ప్రభావం చాలా గట్టిగానే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు బలంగా నమోదవుతున్నాయి.

 

ఇటువంటి నేపథ్యంలో కరోనా కంటే మరొక పెద్ద విషయం ఇప్పుడు హైదరాబాద్ ని వణికిస్తోంది. అదేమిటంటే కొన్ని రోజులపాటు హైదరాబాదు నగరంలో వర్షాలు భారీ స్థాయిలో పట్టనున్నట్లు భారత వాతావరణ శాఖ ఇటీవల వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు హైదరాబాద్ నగరంలో పడబోతున్నట్లు అందువల్లే గత కొన్ని రోజుల నుండి హైదరాబాదు నగరంలో వాతావరణం చల్లగా సాధారణ ఉష్ణోగ్రత తో పోల్చితే 6 డిగ్రీలు తక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

 

ముఖ్యంగా గోల్కొండ, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారిందని వివరించారు. తెలంగాణలోనూ పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ కేరళ మీదుగా వీస్తున్న ఉపరితల ద్రోణి ప్రభావం వల్లేనని స్పష్టం చేశారు. దీంతో వాతావరణం చల్ల బడుతున్న తరుణంలో వైరస్ ఎక్కువగా బలపడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వార్తతో ప్రస్తుతం హైదరాబాద్ వాసులంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: