తెలంగాణలో క‌రోనా దెబ్బ ఎకాన‌మీపై తీవ్ర ప్ర‌భావం చూపించింది. క‌రోనా దెబ్బ‌తో ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలిపోయాయి. ఇక ఇదే ప‌రిస్థితి మ‌న  దేశంలో కూడా ఉంది. అన్ని రంగాల్లో ఉత్ప‌త్తులు ఆగిపోయాయి. ఇక వాస్త‌వంగా ఈ నెల 15 వ తేదీ వ‌ర‌కు తెలంగాణ‌లో లాక్ డౌన్ అమ‌ల్లో ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇది మ‌రింత కొన‌సాగింపు అయ్యేలా ఉంది. ఇక లాక్ డౌన్ ఎత్తి వేయాలంటే అంత ఈజీ కాద‌ని కూడా కేసీఆర్ చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఇప్ప‌ట్లో లాక్ డౌన్ ఎత్తివేయ‌డం క‌ష్ట‌మే అన్న అభిప్రాయం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. 

 

బ‌తికి ఉంటే బ‌లుసు ఆకు కూర అయినా తిన‌వ‌చ్చ‌ని.. ముందు అంద‌రం బ‌త‌కాల‌ని ఆయ‌న చెప్పారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి రోజు తెలంగాణ‌లో రు. 400 - 600 కోట్లు ఆదాయం రావాల్సి ఉంద‌ని.. అయితే ప్ర‌స్తుతం రోజుకు కేవ‌లం 6 కోట్లు మాత్ర‌మే వ‌స్తుంద‌ని చెప్పారు. దీనిని బ‌ట్టి తెలంగాణ రెవెన్యూ ఎంత ప‌డిపోయిందో అర్థ‌మ‌వుతోంది. ఆదాయం లేక‌పోయినా బ‌తికి ఉంటే ఏదోలా బ‌త‌క వ‌చ్చ‌ని కేసీఆర్ అన్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: