క‌రోనా వైర‌స్ ఇప్ప‌ట్లో ప్ర‌పంచాన్ని వ‌దిలే ప‌రిస్థితి లేద‌న్న‌ది ప్ర‌తి ఒక్క‌రికి క్లారిటీ వ‌చ్చేసింది. మ‌న దేశంలో ముందు నుంచి ఇంకా చెప్పాలంటే గ‌త 15 రోజుల నుంచి ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా క‌రోనా వైర‌స్‌కు మాత్రం బ్రేకులు వేయ‌లేక‌పోతున్నాం. ఇప్ప‌టికే మ‌న దేశంలో సోమ‌వారం సాయంత్రంతో చూస్తే క‌రోనా పాజిటివ్ కేసులు ఏకంగా 4 వేలు దాటేశాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా 110 దాటాయి. ప్ర‌తి గంట‌కు క‌రోనా కేసులు. మ‌ర‌ణాలు పెరిగి పోతున్నాయి.

 

ఇక మోదీ ఈ నెల 14వ తేదీ వ‌ర‌కు క‌రోనా లాక్ డౌన్ పాటించాల‌ని చెప్పారు. తెలంగాణ‌లో కేసుల తీవ్రత నేప‌థ్యంలో ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు ముందుగా లాక్ డౌన్ పాటించాల‌ని చెప్పారు. అయితే నిజాముద్దీన్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వారితో రోజు రోజుకు తెలంగాణ‌లో కేసులు పెరిగిపోతోన్న నేప‌థ్యంలో లాక్ డౌన్ పొడిగించ‌డం మిన‌హా చేసేదేం లేద‌ని తెలుస్తోంది. ఇక కేసీఆర్ సైతం సోమ‌వారం సాయంత్రం ప్రెస్‌మీట్లో ఈ లాక్ డౌన్ మ‌రిన్ని రోజులు పొడిగించ‌డం మిన‌హా క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు వేరే మార్గం లేద‌ని చెప్పారు.

 

ముందు మ‌నం బ‌తికి ఉండాల‌ని.. ఆ త‌ర్వాత ఏదో ఒక‌టి చేయ‌వ‌చ్చ‌ని. అవ‌స‌రం అయితే బ‌లుసు ఆకు అయినా తిన‌వ‌చ్చ‌ని.. ప్ర‌ధాన‌మంత్రి మోదీకి సైతం లాక్ డౌన్ పోడిగించాల‌ని చెపుతాన‌ని కేసీఆర్ అన్నారు. దీనిని బ‌ట్టి తెలంగాణ‌లో మ‌రికొన్ని రోజులు లాక్‌డౌన్ కంటిన్యూ అవుతుంద‌న్న‌ది స్ప‌ష్టం అయ్యింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: