బతికి ఉంటే బలుసు ఆకు అయినా తిని బ్రతకవచ్చని కేసీఆర్ చెప్పుకొచ్చారు. దేశంలో లాక్ డౌన్ మినహా మనకు మరో మార్గం లేదని అన్నారు. 22 దేశాలు కంప్లీట్ గా లాక్ డౌన్ చేశాయని. 90 దేశాలు పాక్షికంగా లాక్ డౌన్ చేశాయని, అమెరికాలో, యూరప్ లో మాదిరిగా ఇండియాలొ శవాల గుట్టలులేవని కేసిఆర్ అన్నారు. లాక్ డౌన్ ని ఎత్తివేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక పరిస్థితి చాలా దెబ్బ తినే పరిస్థితి వచ్చిందని, అయినప్పటికీ లాక్ డౌన్ కొనసాగించాలని ఆయన సూచించారు. 

 

తెలంగాణా లో ఈ ఒక్క రోజే 30 కేసులు నమోదు అయ్యాయి అని కేసిఆర్ తెలిపారు. తెలంగాణాలో మరో వంద వరకు పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయి పరిక్షా ఫలితాలు వస్తాయని చెప్పుకొచ్చారు. మొత్తం రాష్ట్రంలో 45 మందిడిశ్చార్జ్ అయ్యారు.11 మంది చనిపోయారని ఆయన పేర్కొన్నారు. స్వయం నియంత్రణ, స్వయం క్రమ శిక్షణ పాటించి మనం చాలా సేఫ్ గా ఉన్నామని అన్నారు. లాక్ డౌన్ తో నాలుగు వేల కేసుల దగ్గరే ఆగిపోయామని అన్నారు. కానీ అమెరికా పరిస్తితి అలా లేదు, 

 

కరోనాతో అమెరికాలో రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని కేసిఆర్ తెలిపారు. కేసిఆర్ ఆవేదనతో మాట్లాడుతూ మరణాలు మిగిల్చే విషాదాన్ని దేశం భరించలేని అభిప్రాయ పడ్డారు. లాక్ డౌన్ కు సహకరించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే భవన్ నుంచి ప్రజలు బయటకు రావాలని కోరారు.  ఇండియా లో లాక్ డౌన్ కొనసాగక తప్పని పరిస్థితి అని కేసీఆర్ అభిప్రాయం పడ్డారు. 

 

జూన్ 3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని బోస్టన్ కన్సేల్టింగ్ గ్రూప్ నివేదిక ఇచ్చిందని కేసీఆర్ కీలక వ్యాఖ్య చేసారు. ప్రధాని అడిగితే లాక్ డౌన్ కొనసాగించాలని తాను చెప్పినట్టు వివరించారు. లాక్ డౌన్ సడలిస్తే అందరూ ఒక్కసారిగా గుమి గూడె ప్రమాదం ఉంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ సడలించడం అంటే మామూలు విషయం కాదని కేసీఆర్ అన్నారు. సోషల్ మీడియా అనేది నేడు యాంటీ సోషల్ గా మారింది అని కేసిఆర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: