ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించారు కాపు వర్గానికి చెందిన ముద్రగడ్డ పద్మనాభం. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం జరిగిందో అప్పుడే కాంగ్రెస్ పార్టీకి ముద్రగడ రాజీనామా చేశారు. ఆ తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఎన్ని కావడం జరిగింది. అయితే ఆ టైమ్ లో కాపులను బీసీల్లో చేరుస్తూ అని వాగ్దానం నుంచి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీని తుంగలో తొక్కడంతో...ముద్రగడ పద్మనాభం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కాపులు గురించి తుని లో గట్టిగా పోరాటం చేశారు. దీంతో ముద్రగడ్డ పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఇదే తరుణంలో చంద్రబాబు ఆయన ఇంటికి పరిమితం చేసి పోలీసుల చేత బయటకు రాకుండా ముద్రగడ చేస్తున్న ఉద్యమాన్ని అణచి వేశారు.

 

అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయంగా ముద్రగడ్డ పైకి రావాలని సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం జాతీయ పార్టీ బిజెపి ముద్రగడ్డ కి మంచి స్థానం ఇవ్వాలని సరికొత్త ఆఫర్ ఇవ్వటానికి రెడీ అవుతున్నట్లు జాతీయ మరియు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. ఎప్పటి నుండో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీ...ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను పార్టీలోకి తీసుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కారణం చూస్తే ఏపీ ఓటింగులో ఎక్కువగా కాపుల ఓట్ బ్యాంక్ ఉండటం.

 

దీనికోసమే ముందుగా కన్నా లక్ష్మీనారాయణ ని చేర్చుకున్న బీజేపీ ఇప్పుడు తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నీ బీజేపీ లో చేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. దీని కోసం ఢిల్లీలో బీజేపీ పెద్దలు ముద్రగడ తో భేటీ కానున్నారు అని ముద్రగడ రాక కోసం ఎదురు చూస్తున్నారని వార్తలు బలంగా వినబడుతున్నాయి. మీటింగ్ అంతా ఓకే అయితే ముద్రగడ ఓకే అంటే ఏపీ బీజేపీ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం నీ నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: