భారతదేశంలో లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్నా, కరోనా మహమ్మారి విజృంభణ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల కరోనా కేసులు నిదానంగా బయటపడ్డాయి. అయితే ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రభావంతో కరోనా కేసులు మరింతగా పెరిగాయి. ఊహించని విధంగా అన్నీ రాష్ట్రాల్లో ఈ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన వారితో కరోనా కేసులు ఎక్కువయ్యాయి.

 

దేశంలో ఇప్పటిదాకా కొవిడ్-19 పాజిటివ్ కేసులు 4,087 యాక్టివ్‌లో ఉన్నాయి. ఇక  వాటిలో 1,445 మంది తబ్లీగీ ప్రార్థనల్లో పాల్గొన్నవాళ్లేనని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఈ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. అక్కడ ఊహించని విధంగా 781 కరోనా కేసులు ఉన్నాయి. ఇక ఇందులో 45 మంది వరకు చనిపోగా, 56 మంది రికవర్ అయ్యారు. అయితే మహారాష్ట్రలో కమ్యూనిటి ట్రాన్స్ మిషన్(లోకల్ వ్యాప్తి) ఎక్కువగా ఉందని తెలిసింది. అందుకే అక్కడ మరిన్ని కరోనా కేసులు బయటపడే అవకాశముందని తెలుస్తోంది.

 

ఇక మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, ఢిల్లీలలో పరిస్తితి దారుణంగా ఉంది. తమిళనాడులో ప్రస్తుతం 621 కరోనా కేసులు ఉంటే, ఢిల్లీలో 523 కేసులు ఉన్నాయి. నాల్గవ స్థానంలో తెలంగాణ ఉంది. ఇక్కడ 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 308 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక 11 మంది మరణించారు.

 

ఆ తర్వాత కేరళ 327, ఉత్తర్ ప్రదేశ్ 305 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో 303 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అయితే ఇందులో 5 మంది రికవర్ అవ్వగా, ముగ్గురు చనిపోయారు. ఏపీ తర్వాత రాజస్థాన్ 288 కేసులు, మధ్యప్రదేశ్ 193, కర్ణాటక 163 కేసులతో వరుసగా 8,9,10 స్థానాల్లో ఉన్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. మరి చూడాలి రానున్న రోజుల్లో ఎన్ని కేసులు పెరుగుతాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: