తెలంగాణ సీఎం కేసీఆర్ క‌రోనాపై అలు పెర‌గ‌ని పోరాటం చేస్తోన్న నిజ‌మైన దేవుళ్లు అయిన తెలంగాణ వైద్య సిబ్బందికి అదిరిపోయే గిఫ్ట్ ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాల్లో బారీ కోతుల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో చాలా మందికి 50 శాతం నుంచి 60 శాతం వ‌ర‌కు వేత‌నాల‌ కోత‌లు ప్ర‌క‌టించారు. అఖిల భార‌త స‌ర్వీసుల్లో ఉన్న వారికి 60 శాతం కోత‌లు విధించిన కేసీఆర్ ప్ర‌భుత్వ ఉద్యోగాలు చేస్తోన్న రాష్ట్ర‌ ఉద్యోగుల‌కు 10 నుంచి 50 శాతం వ‌ర‌కు వేత‌నాల్లో కోత‌లు పెట్టారు. 

 

అయితే కేసీఆర్ క‌రోనా రోగుల‌కు వైద్యం చేస్తోన్న నిజ‌మైన దేవుళ్లు అయిన డాక్ట‌ర్ల‌కు మాత్రం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తెలంగాణ‌లో క‌రోనాను క‌ట్ట‌డి చేసే విష‌యంలోనూ.. క‌రోనా రోగుల‌కు వైద్యం చేసే విష‌యంలోనూ.. వారికి ధైర్యం క‌ల్పించ‌డంలోనూ డాక్ట‌ర్లు, వైద్య సిబ్బంది చాలా గొప్ప‌గా ప‌ని చేస్తున్నారు అని ప్ర‌శంసించారు. వారికి 100 శాతం జీతంతో పాటు 10 శాతం అద‌నంగా ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు.

 

ఇక జీహెచ్ఎంసీలో శానిటేష‌న్ వ‌ర్క‌ర్ల‌కు రు. 7500 జీతం అద‌నంగా ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేసిన కేసీఆర్‌, తెలంగాణ‌లో ప‌నిచేసే మునిసిప‌ల్ శాటినేష‌న్ వ‌ర్క‌ర్ల‌కుఉ అద‌నంగా రు. 5000 ఇస్తున్నామ‌న్నారు. అలాగే తెలంగాణ‌లో 25 వేల మంది వైద్య సిబ్బంద‌ది ఎంతో క‌ష్ట‌మైనా ప‌ని చేస్తున్నారంటూ కేసీఆర్ వారిని కొనియాడారు. ఇక తెలంగాణ‌లో ఇప్ప‌టికే 16 నుంచి 18 వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. డాక్ట‌ర్ల ధైర్యాన్ని కూడా త‌గ్గించేలా చిల్ల‌ర రాత‌లు రాసే ప‌త్రిక‌లపై కేసీర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: