తెలంగాణ‌లో క‌రోనాపై తాము అంతా ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండి పోరాటం చేస్తున్నామ‌ని.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో మ‌నం క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డాలంటే మ‌రి కొద్ది రోజులు లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గ‌మ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. సోమ‌వారం సాయ‌త్రం మీడియా స‌మావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే కొన్ని ప‌త్రిక‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. ఈ సంక్షోభ స‌మ‌యంలో ధైర్యం చెప్పాల్సింది పోయి... ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు క‌లిగించేలా రాత‌లు ఎందుకు రాస్తార‌ని ఫైర్ అయ్యారు.

 

చైనా లేక‌పోతే మ‌నం బ‌త‌క‌లేం అని కొంద‌రు మ‌కిలి గాళ్లు మ‌కిలీ రాత‌లు రాస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్పుతున్నాడంటే కాస్త ఖ‌త‌ర్నాక్‌గా ఉంటుంద‌ని కూడా కొన్ని ప‌త్రిక‌ల‌కు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. వీరికి క‌రోనా సోకాల‌ని శాపం పెట్టిన కేసీఆర్‌... ఎవ‌రు అయితే దుర్మార్గంగా చిల్ల‌రంగా చిల్ల‌ర బుద్ధితో అవ‌గాహ‌న‌తో అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నారో ఆ దుర్మార్గుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కూడా  హెచ్చ‌రించారు. 

 

ఈ స‌మ‌యంలో జాతి ఐక్య‌త పెంపొందించే వాడు... ప్ర‌జ‌ల్లో ధైర్యం నింపేవాడ‌ని గొప్ప వాడు అని.. రు. 20 వేల డొనేష‌న్లు ఇచ్చిన బీడీ కార్మికురాలు గొప్ప‌వాళ్ల‌ని.. వాళ్ల కాళ్లు క‌డిగి మ‌నం నెత్తిన పోసుకోవాల‌ని.. ఇలాంటి ప‌నికి మాలిన వాళ్లు మ‌న‌కు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల ఓ ప‌త్రిక డాక్ట‌ర్ల‌కు జాగ్ర‌త్త‌లు లేవంటూ అస‌త్య వార్తలు రాసింద‌ని.. డాక్ట‌ర్ల విష‌యంలో తాము ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామో ?  మీకు తెలుసా ?  మాకు తెలుసా ? అని ప్ర‌శ్నించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: