దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినా కరోనా వైరస్ మాత్రం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది . ప్రస్తుతం దేశం లో కరోనా వైరస్ వ్యాప్తి మూడవ దశకు చేరుకుందని , ఈ దశలో అత్యంత అప్రమత్తం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు . కరోనా మూడు దశల్లో వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు . మొదటి దశలో కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకగా , రెండవ దశలో కరోనా సోకిన వారినుంచి ఇతరులకు కాంటాక్ట్  ద్వారా ఈ వ్యాధి సోకుతుంది .

 

ఇక మూడవ దశలో కరోనా బాధితుల నుంచి ఈ వ్యాధి ఎవరికి సోకుతుందనేది అంచనా వేయడం కష్టమని నిపుణులు పేర్కొంటున్నారు . ఇప్పుడు దేశం లో కరోనా మూడవ దశలో ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక ప్రకటన చేశారు . అయితే దేశం లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి రెండవ దశలో ఉండగా , కొన్ని ప్రాంతాల్లో మూడవ దశలో ఉందని అన్నారు .  వైరస్ సోకిన వారు క్వారంటైన్ పాటించకుండా , రోడ్లపై సంచరించడం , ఇతరులతో కాంటాక్ట్  కావడం వల్లే వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు .

 

  దేశం లో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందడానికి , సామాజిక దూరం పాటించకపోవడమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు . సామాజిక దూరం పాటించడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు . కరోనా కట్టడికి స్వీయ  నిర్బంధాన్ని మించిన మార్గం లేదని గులేరియా అన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: