తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న సుదీర్ఘ విలేక‌రుల స‌మావేశంలో కీల‌క వ్యాఖ్య‌లు, స‌మ‌గ్ర విశ్లేష‌ణ‌లు, ప‌లు ర‌కాలైన ఆగ్ర‌హాలు వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వివిధ వ‌ర్గాలు స‌మాజ అభివృద్ధికి క‌లిసి రావాల‌ని సైతం ఆకాంక్షించారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామరాజన్ గురించి సీఎం కేసీఆర్ ప్ర‌స్తావించారు. ఆయ‌న ఓ ప‌త్రిక‌లో రాసిన విష‌యాన్ని గురించి పేర్కొంటూ...షికాగో బూత్ యూనివర్సిటీలో ఫైనాన్స ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాజన్ తన బ్లాగ్‌స్పాట్‌లో కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. కరోనా కల్లోలం అనేది భారత్‌ను స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన అతిపెద్ద ఆపదగా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాపై పెనుభారం పడుతున్నప్పటికీ పేదల కోసం డబ్బు వెచ్చించడమే సరైనదని  రఘురామరాజన్ ఆయ‌న పేర్కొన్నారు. ప్రస్తుతం యూరప్ దేశాలు పది శాతం జీడీపీ సులభఫంగా ఖర్చు చేయగలవని, కానీ భారత్ ఈ సరికే బారీ ద్రవ్యలోటుతో సంక్షోభంలో చిక్కుకున్నదని గుర్తు చేశారు. అయినా బారత్ ఇంకా ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు.

 


ఈ సంద‌ర్భంగా కీల‌క‌మైన లాక్‌డౌన్ ప‌రిస్థితుల‌ను సైతం ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ వివ‌రించారు. లాక్ డౌన్ అనంతర కాలపు వ్యూహాల గురించి ప్రస్తావిస్తూ ఎక్కువ రోజులు పనికి దూరమైన పేదలు, వేతనదార్లు కాని దిగువ మధ్యతరగతివారు బతికిబట్టకట్టేందుకు అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. ఆహారం, ఆరోగ్య సంరక్షణ, ఆశ్రయం వంటివి అందించేందుకు ప్రభుత్వం, ఎన్జీవోలు సమిష్టిగా చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే రుణాల చెల్లింపు మారటోరియం, ఇళ్లు ఖాళీ చేయించడం నుంచి రక్షణ వంటివి ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని తెలిపారు.

 


ప్రగతి భవన్‌లో కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌పై అత్యున్నత‌ స్థాయి సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఇండియా మంచి పని చేసింది అని ఇంటర్నేషల్‌ జర్నల్స్‌ ప్రకటించాయని, ర‌ఘురామ్ రాజ‌న్ సైతం ఇదే విష‌యాన్ని వ్య‌క్తిక‌రించార‌ని అన్నారు. ``ఐక్యతను ప్రదర్శించి ఇండియా మంచి పని చేసిందని ఇతర దేశాల అధినేతలు ప్రశంసించారు. లాక్‌డౌన్‌ విధించకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే వాళ్లం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం మనది. అమెరికా లాంటి దేశం భయంకరమైన పరిస్థితిలో ఉంది. న్యూయార్క్‌లో శవాల గుట్టలు ఉన్నాయి. అక్కడ బాధలు హృదయవిదారకంగా ఉన్నాయి`` అని సీఎం తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: