కరోనా నిరోధానికి పాత పద్ధతులను కొత్తగా పరిశీలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్లు అందుబాటులో లేని కాలంలో అవలంభించిన విధానాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. రోగి నుంచే రోగ నిరోధక శక్తిని రూపొందించే కీలక కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనాతో కోలుకున్న రోగి రక్తం నుంచి సేకరించిన ప్లాస్మాతో వ్యాధిని నిరోధించవచ్చన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

వ్యాక్సిన్ లేదు....  వ్యాక్సిన్ కోసం చేస్తున్న ఫలితాలు ఇంకా ప్రయోగశాలలు దాటలేదు. వేల కోట్లతో వందల కంపెనీలు వ్యాక్సిన్ కనిపెట్టడానికి కోసం ఆహోరాత్రులు కృషి చేస్తున్నాయి. మరోవైపు విజృంభిస్తున్న కరోనా నిత్యం వందల ప్రాణాలను బలి తీసుకుంటోంది. కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాలు.. వ్యాధి నిరోధానికి కొత్త పద్ధతులతోపాటు పాత వాటినీ పరిశీలిస్తున్నాయి.

 

కొలుకున్న వారి రక్తమే ఔషధంగా కరోనా పాజిటివ్ పేషంట్స్ ట్రీట్ మెంట్ పై ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో ప్రపంచాన్ని కుదిపేసిన మీజిల్స్, డిఫ్తీరియా వంటి అంటు వ్యాధులను నయం చేయడానికి ప్లాస్మా విధానంలో చికిత్స చేసారు . ఇప్పుడు కరోనాకు కూడా అటువంటి పద్ధతిలోనే చికిత్స అందించే ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు ముమ్మరం చేశారు. 

 

మానవ శరీరంలో అయిదారు లీటర్ల రక్తం ఉంటుంది . రక్తంలో ప్రవహించే సీరంను ప్లాస్మా అంటారు .రక్తంలో ఉండే పసుపురంగు ద్రవ భాగమే ప్లాస్మా. శరీర రక్త పరిమాణంలో ప్లాస్మా 55 శాతం ఉంటుంది .రక్తం నుంచి రక్త కణాలను వేరుచేయగా మిగిలేదే ప్లాస్మా అంటారు .రక్తంలో ఉండే ప్లాస్మాలో రోగ నిరోధక కణాలు ఉంటాయి. సాధారణంగా మానవ శరీరంలోకి హానికర సూక్ష్మజీవి ఎంటర్ అయితే రోగ నిరోధక శక్తి దాన్ని అడ్డుకుంటుంది . రోగం నుంచి కోలుకున్న మనిషి శరీరంలోని రక్తంలో యాంటీ బాడీలు ప్రవహిస్తూ ఉంటాయి. వీటి నుంచి ప్లాస్మాను వేరు చేసి రోగులకు ఇవ్వడం ద్వారా మీజిల్స్, డిఫ్తీరియా నుంచి కాపాడారు. ఇప్పుడు ఇదే పద్ధతిని కరోనా రోగుల మీదా ప్రయోగిస్తున్నారు. అమెరికా సహా అన్ని దేశాల్లో ఈ పద్దతిపై ఇప్పుడు అద్యయనం చేస్తున్నాయి.

 

అయితే ప్లాస్మా పద్ధతిలో ప్రతి అయిదుగురు రోగుల్లో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు గుర్తించారు. కోలుకున్న రోగి నుంచి ప్లాస్మా సేకరించి...  రోగి శరీరంలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ 90 నిమిషాల్లో ముగుస్తుంది. కరోనా కు వ్యాక్సిన్ వచ్చే లోగా ప్లాస్మా విధానం సక్సెస్ అయితే... ప్రమాదం నుంచి బయటపడ్డట్టేనని వైద్యులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: