భారతదేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కరోనా సోకడంతో దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఓ వైపు లాక్ డౌన్ కఠినంగానే అమలు చేస్తూ, మరో వైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితులని సమీక్షిస్తున్నారు. అటు కేంద్ర మంత్రులు, ఇటు ఇతర రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు.

 

ఇదే సమయంలో పరిస్థితిని బట్టి లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. అయితే కరోనాపై తీవ్ర యుద్ధం చేస్తున్న నేపథ్యంలో మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు ఎంపీల జీతాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించారు. అటు కరోనా నేపథ్యంలో ప్రస్తుత స్థితిని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తూ తమ వేతనాల్లోనూ కోతకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

 

ఈక్రమంలోనే రెండేళ్ల ఎంపీ లాడ్స్ మొత్తంగా వచ్చే రూ.7,900 కోట్లతో ఒక నిధిని (కన్సాలిడేటెడ్ ఫండ్) ఏర్పాటు చేశారు. కాకపోతే నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన ఎంపీలాడ్స్ నిధులను రెండేళ్ల పాటు నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఈ నిధులను ఆపడమంటే తమ నియోజకవర్గాల్లో ఎంపీల పాత్రను, వారి విధులను చులకన చేయడమేనని చెప్పింది.

 

అయితే మామూలుగా ఎంపీ నిధులు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. కానీ కరోనా తీవ్రత ఎక్కువగా  ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు సంబంధించిన రెండేళ్ల నిధులని ఒక నిధిగా ఏర్పాటు చేసి, కరోనా కోసం ఉపయోగించనున్నారు. దేశం మొత్తానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. మరి ఇలా ఉపయోగ పడే నిధిపై కాంగ్రెస్ అభ్యంతరం చెబుతోంది. ఇప్పటికే చాలామంది ఎంపీలు తమకు వచ్చే నిధులని కరోనా కట్టడికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం రెండేళ్ల నిధులని కరోనా కోసం వినియోగించనుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడంలో ఎలాంటి అర్ధం లేదు. ఇలాంటి టైమ్‌లో ప్రధానికి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి, ఆయన తీసుకుని నిర్ణయాలని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: