ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ప్రతి కుటుంబానికి వైయస్ జగన్ ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. కరోనా వైరస్ వల్ల చాలా మంది ఉద్యోగాలకు వెళ్ళలేక ఉపాధి కోల్పోవడంతో వాళ్ళని ఆదుకోవడం కోసం జగన్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఇచ్చారు. అయితే ఈ వెయ్యి రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటూ జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టుగా వైసిపి నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఇంటికి పంచిపెట్టిన వెయ్యి రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది.

 

ఇదే సమయంలో బాబోరు మీడియా కూడా వెయ్యి రూపాయల విషయంలో వైఎస్ జగన్ సర్కార్ పై అనేకమైన విమర్శలు చేయడం జరిగింది. అయితే ఈ తరుణంలో వైసిపి నాయకులు మార్చి నెలలో వైయస్ జగన్ ప్రతి ఇంటికి కరోనా విపత్తు నేపథ్యంలో ఇస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారని ఇచ్చిన వెయ్యి రూపాయలకి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.

 

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 500 రూపాయలు ఇస్తాను అన్నది 'జన్ ధన్' ఖాతా ఉన్నవాళ్లకి...మరి అటువంటి టైములో గ్రామ వాలంటీర్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎందుకు ఇస్తుందని గట్టిగా కౌంటర్ వేశారు. ఇదే టైంలో సోషల్ మీడియాలో ఈ వార్త రావడంతో నెటిజన్లు వెయ్యి రూపాయలు ఎవరు ఇస్తే ఏంటి ఇప్పుడు...అది ప్రజల కొరకు ప్రజల వద్దకే వచ్చిందని అధికారం మరియు ప్రతిపక్ష నాయకులకు గట్టిగా కౌంటర్లు వేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో కూడా రాజకీయాలు ఏంటయ్యా అంటూ మరికొంత మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: