మందులేని కరోనా వైరస్ ని ఎదుర్కోవాలంటే నియంత్రణ ఒకటే మార్గం కావడంతో భారత్ ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ విధించింది. కాగా లాక్ డౌన్ ఈనెల 14వ తారీఖున ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ పొడిగించే అవకాశం లేదని కేంద్రం ఇటీవల స్పష్టం చేయడం జరిగింది. దశలవారీగా షరతులతో కూడిన విధంగా లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ముందుగా పల్లెల్లో తర్వాత పట్టణాల్లో అదేవిధంగా మెట్రో పాలిటన్ సిటీలలో లాక్ డౌన్ ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే చోట మాత్రం లాక్ డౌన్ అమలులో ఉంచాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని వేడుకొంటున్నాయి.

 

అయితే ఇప్పటికే దేశంలో ఉన్న ప్రజలంతా ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఇంటిలో అనేక అవస్థలు పడుతూ...జీవితాలను నెట్టుకొస్తున్న తరుణంలో లాక్ డౌన్ ఇంకా కొనసాగితే ప్రభుత్వాలపై పోలీసులపై తిరగబడే అవకాశముంది అని...దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదని...కాబట్టి ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తివేయడమే బెటర్ అని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించినట్లు సమాచారం.

 

ఇదిలా ఉండగా లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా ఆస్తులు పడింది ఎవరైనా ఉన్నారంటే అది మందుబాబులు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో త్వరలో లాక్ డౌన్ ఎత్తేస్తే రోడ్లు మొత్తం మందు బాబులతో నిండిపోతాయి అని చాలా మంది అంటున్నారు. ఇప్పటికే ముందు లేక చాలా చోట్ల...మూసేసిన దుకాణాలలో దొంగతనం చేస్తున్నారని త్వరలో లాక్ డౌన్ ఎత్తేస్తే రోడ్లు మొత్తం మందు బాబులతో కళకళలాడుతుంది అంటూ చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: