ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మసీదు లో జరిగిన తబ్లీగి జమాత్ మతసమ్మేళనం లో పాల్గొన్న వారిలో  కొంతమంది వ్యక్తులకు  కరోనా పాజిటివ్ అని తేలినప్పటికీ,  వైద్యులు , వైద్య సిబ్బంది పట్ల వారు అనుచితంగా  ప్రవర్తించినతీరు   తీవ్ర విమర్శలపాలయింది  . వైద్యులు , వైద్య సిబ్బందిపై   ఉద్దేశ్యపూర్వకంగా ఉమ్మివేయడం ... దగ్గరకు వెళ్లి తుమ్మడం చేశారు . అయినా  ఇంతవరకూ వారిపై  ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు .

 

అయితే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరించే కరోనా రోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది . కరోనా రోగులు ఎవరైన ఉద్దేశ్యపూర్వకంగా ఎదుటివారిపై ఉమ్మిన, దగ్గరకు వెళ్లి తుమ్మినా  వారిపై  హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది . ఇక కరోనా రోగులు ఉమ్మివేయడం , తుమ్మడం వల్ల ఎదుటి వ్యక్తులు కరోనా వ్యాధి సోకి చనిపోతే వారిపై హత్య కేసుగా నమోదు చేయనుంది . దానికి ఆ మరణాన్ని సాక్ష్యంగా చూపాలని   హిమాచల్ సర్కార్ ఉత్తర్వుల్లో  పేర్కొంది . హిమాచల్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి .

 

కరోనా బాధితులకు ప్రాణాలొడ్డి వైద్య సేవలను అందిస్తోన్న వైద్యులు , వైద్య సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించే వ్యక్తులపై ఈ తరహా కఠిన చర్యలు తీసుకోవడం  మంచిదేనని పేర్కొంటున్నారు  . హిమాచల్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలన్నారు . ఈ విపత్కర సమయం లో కఠినంగా వ్యవహరించడం ద్వారా చట్టాన్ని చుట్టంగా భావించే వారిని కట్టడి చేయవచ్చునని అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: