కరోనా విస్తృతి నేపధ్యం లో దేశ వ్యాప్తంగా  లాక్ డౌన్ ప్రకటించడం తో నెలకొన్న ఆర్ధిక ఇబ్బందులను అధిగమించేందుకు మోదీ సర్కార్  తీసుకున్న  నిర్ణయం పట్ల  ఎంపీల పరిస్థితి ముందు నుయ్యి - వెనుక గొయ్యి అన్న చందంగా తయారయింది . ప్రధాని నరేంద్ర  మోదీ తో సహా  ఎంపీల జీతాల్లో కోతవిధించాలని కేంద్రం నిర్ణయించింది . జీతాల్లో కోత విధించడాన్ని ఎంపీలు ఎవరు పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదట ... కానీ రెండు ఏళ్లపాటు ఎంపీ నిధులకు కోత విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం  వారికి ఏమాత్రం రుచించడం లేదని తెలుస్తోంది .

 

ప్రతి ఎంపీ కి ఏటా ఐదుకోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నారు . నిబంధనల మేరకు  ఈ నిధుల్ని ఎంపీలు ఎక్కడైన అభివృద్ధి పనులకు  కేటాయించే వెసులుబాటు కల్పించారు . ఇదే అదనుగా  కొంతమంది లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గం కాకపోయినా, ఇతర ప్రాంతాల  అభివృద్ధి కోసం  నిధుల కేటాయించడం విమర్శలకు తావునిస్తోంది . ఇక కొంతమంది ఎంపీలు తమ  నిధులను సొంత డబ్బులున్నట్లుగా విరాళాలు ప్రకటించడం కూడా  తెల్సిందే .

 

కేంద్ర ప్రభుత్వం  తొలుత ప్రతి  ఎంపీ కి  కేవలం ఐదు లక్షల రూపాయల నిధులు కేటాయించగా  , ఆ తరువాత వాటిని  రెండు కోట్లకు పెంచారు .  ప్రస్తుతం ఒకొక్క ఎంపీకి ఏడాదికి  ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు . దీనితో రెండేళ్లపాటు ఎంపీ నిధులకు కోత విధించడమంటే  ఒకొక్క ఎంపీ పది కోట్ల రూపాయల నిధులు దక్కకుండా పోనున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: