కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తున్నాం.. రోజుల్లోనే ఈ సంఖ్య లక్షలకు చేరుకుంటోంది. ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 14 లక్షల మంది వరకూ ఈ రోగం బారిన పడ్డారు. ఇంకా ఇండియాలో ఈ కేసుల సంఖ్య 5 వేల లోపే. కానీ.. ఇండియాలో ఈ కేసుల సంఖ్య కూడా లక్షల్లోకి వెళ్తే పరిస్థితి ఏంటి.. అసలే పెద్ద దేశం..అందులోనూ పేద దేశం.

 

 

మరి ఈ కరోనా మహమ్మారిని దేశం ఎదుర్కోగలుగుతుందా.. అసలే మన ఇండియాలో వైద్య మౌలిక సదుపాయాలు అంతంత మాత్రం. ప్రస్తుతం కేసుల సంఖ్య వేలల్లో ఉంది కాబట్టి పరవాలేదు. మరి ఈ కేసుల సంఖ్య వేల నుంచి లక్షలకు వెళ్తుందా.. వెళ్తే అప్పుడు పరిస్థితి ఏంటి.. లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే.. ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నారు. బీసీజీ వంటి ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థ.. జూన్‌ వరకూ లాక్‌డౌన్ ఎత్తకపోవడం ఉత్తమని చెబుతోంది.

 

 

మరి అప్పటి వరకూ పేద జనం, కూలీలు వంటి కిందిస్థాయి జనం మాటేమిటి.. వారి ఆకలి తీర్చేదెవరు.. కేంద్రం మాత్రం ఎన్ని ప్యాకేజీలు ప్రకటిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉదయిస్తున్నాయి. ఇదే సమయంలో ఇండియాలో సంపదకు కొదవలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. కాకపోతే అది కేంద్రీకృతంగా ఉంది. కానీ.. కష్టకాలం. ఆపద సమయం అంటూ వస్తే.. ప్రైవేటు వ్యక్తుల సంపదను కూడా హస్తగతం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని చెబుతున్నారు.

 

 

ఇండియాలో మరీ అంతగా కరోనా విజృంభిస్తే.. అప్పుడు కేంద్రం దేశంలోని బిలియనీర్ల వద్ద పోగుబడిన సంపదను తీసుకుని.. ప్రభుత్వాన్ని నడిపించేందుకు కూడా వెసులుబాటు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అది చాలా రేర్ కండిషన్ అనే చెప్పాలి. కానీ ప్రభుత్వాలను వేరే గత్యంతరం లేకపోతే మాత్రం.. దేశ రక్షణ కోసం అంబానీలు వంటి లక్షల కోట్ల ఆస్తులున్నవారి సంపదను సైతం కేంద్రం హస్తగతం చేసుకోవచ్చంటున్నారు. పరిస్థితి అక్కడి వరకూ రాకూడదనే కోరుకుందాం.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:

Apple :

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: