కరోనా కట్టడికి లాక్ డౌన్ మాత్రమే శరణ్యమని తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే , దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది  . లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా ను కట్టడి చేయడం అంతాఆషామాషి వ్యవహారం కాదని కేసీఆర్ పేర్కొన్నారు . ఆర్ధికంగా నష్టపోయినా పుంజుకోవచ్చు కానీ ప్రాణనష్టమన్నది  జరిగితే దాన్ని పూడ్చడమన్నది ఎవరి వల్ల  సాధ్యం కాదని ఆయన  అన్నారు .

 

అయితే కేసీఆర్ ఎంతగా  చెబుతున్నా,  ఏప్రిల్ 14 వతేదీ తరువాత  యధావిధిగా లాక్ డౌన్ ను  కొనసాగించే అవకాశాలు ఎంతమాత్రం లేవని తెలుస్తోంది . ఇప్పటికే లాక్ డౌన్ వల్ల రోజువారీ కూలీలు , ఉపాధి కార్మికులు , వేతన జీవులు తీవ్ర ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ... ఒకవైపు  కరోనా కట్టడికి  అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే , మరొకవైపు దశలవారీగా లాక్ డౌన్  సడలింపు ప్రక్రియ వైపే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది .  ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ , మంత్రి వర్గ సహచరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్  లో  వెల్లడించారు . లాక్ డౌన్ సడలించేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన వారికి  సూచించారు .

 

కరోనా హాట్ స్పాట్ లు మినహాయించి , మిగతా ప్రాంతాల్లో దశల వారీగా లాక్ డౌన్ సడలించే విధంగా ప్రణాళిక ఉండాలని మంత్రివర్గ సహచరులకు మార్గనిర్దేశం చేశారు . కరోనా హాట్ స్పాట్ కేంద్రాలు మినహాయించి మిగతా ప్రాంతాల్లో అన్ని శాఖలు నెమ్మదిగా  తమ పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించాలని  మోదీ తన  మంత్రివర్గ సహచరులకు వెల్లడించారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: