కరోనా మహమ్మారి అన్ని రంగాలకూ కుంగదీస్తోంది. కరోనాపై వస్తున్న వదంతుల కారణంగా అన్ని రంగాల్లోనూ ధరలు పడిపోతున్నాయి. అందులోనూ ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా పండిన పంటను ఎక్కడికీ తీసుకెళ్లే పరిస్థితులు లేవు. ఇలాంటి సమయంలో రైతులకు జగన్ సర్కారు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి అంటే.. మంగళవారం నుంచి మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

 

 

పంటలకు గిట్టుబాటు ధరలపై మంత్రి కురసాల కన్నబాబు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు కలెక్టర్లు, మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్లతో మాట్లారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఆదేశించారన్నారు. పంటల మద్దతు ధరలు పడిపోవడానికి వీల్లేదని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు.

 

 

అంతే కాదు.. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని కన్నబాబు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఏ రైతు ఇబ్బంది పడటానికి వీల్లేదని, మామిడి, ఇతర పండ్ల ధరలు పడిపోకుండా చూడాలి కన్నబాబు అధికారులను ఆదేశించారు.

 

 

మంగళవారం నుంచి మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు.. ఇందుకోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ పంట వృథా అవుతుందన్న ఆందోళనలో ఉన్న రైతన్నకు కాస్త ఊరట కలిగినట్టయింది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతన్నకు ఇది ఊరట కలిగించే అంశమనే చెప్పాలి.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: