దేశంలో కరోనా వైరస్ వేగంగా పెరుగుతుంది. ఊహించని విధంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 5 వేలకు చేరువలో ఉన్నాయి కరోనా కేసులు. ఇప్పుడు లాక్ డౌన్ అమలులో ఉన్నా సరే ఈ కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉండటం ఇప్పుడు ఇబ్బంది పెట్టే పరిణామం గా చెప్పుకోవచ్చు. దీన్ని ఏ విధంగా కట్టడి చెయ్యాలి అనేది మన దేశం తో పాటుగా ప్రపంచ దేశాలకు కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. 

 

దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ ని కట్టడి చేయకపోతే మాత్రం నష్టం తీవ్రంగా ఉంటుంది అనే హెచ్చరికలు వస్తున్నాయి. కరోనా నుంచి దేశం ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది అనే అభిప్రాయం ఇప్పుడు ఎక్కువగా వ్యక్తమవుతుంది. దీన్ని ఇంకా పెంచి పోషిస్తే మాత్రం నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉందనే హెచ్చరికలు చేస్తున్నారు నిపుణులు. ఎంత ఫాస్ట్ గా కుదిరితే అంత వేగంగా దీన్ని కట్టడి చెయ్యాల్సిన అవసరం ఉందని, 

 

లాక్ డౌన్ ని కచ్చితంగా పెంచాలని ఇప్పుడు లాక్ డౌన్ ని అమలు చేయకపోతే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండ అవకాశం ఉందనే అభిప్రాయం ఎక్కువగా వినపడుతుంది. లాక్ డౌన్ ని రెండు నెలలు పొడిగిస్తే దేశం బయటపడుతుంది అంటున్నారు. మన దేశంలో జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి లాక్ డౌన్ ని ఎత్తేస్తే అందరూ బయటకు వచ్చి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించి ఇప్పుడు ఎక్కువగా లాక్ డౌన్ పెంచాలి అని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: