ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతి తగ్గుతుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నాయి. ఇటలీ లో కరోనా కేసులు రోజు రోజుకి తగ్గు ముఖం పడుతున్నాయని అక్కడి ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మన దేశంలో కరోనా కేసులు చాలా వరకు అదుపులోనే ఉన్నాయి. 

 

లాక్ డౌన్ నిర్ణయం మన దేశాన్ని బయటపడేసింది అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. స్పెయిన్ లో కూడా కరోనా వైరస్ వేగం తగ్గుతుంది. అక్కడ మరణాలు ఎక్కువగా నమోదు కావడమే ఆందోళన కలిగించే అంశం గా చెప్పుకోవచ్చు. అమెరికాలో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరగడం ఇప్పుడు అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేసే అంశంగా చెప్పుకోవచ్చు. అమెరికాలో అన్ని నగరాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. 

 

అమెరికాలో మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయని పలువురు అంటున్నారు. అమెరికాలో రాబోయే రెండు నెలల్లో భారీగా చనిపోయే అవకాశం ఉంది, న్యూయార్క్ లో నిన్న ఒక్క రోజే వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం దీనితో నరకం చూస్తుంది. అయితే కేసులు మాత్రం తగ్గు ముఖం పట్టడం ప్రపంచ దేశాలకు ఇప్పుడు శుభ పరిణామం గా చెప్పుకోవచ్చు. ఇక వ్యాక్సిన్ విషయంలో అన్ని దేశాలు కూడా దూకుడుగా ఉన్నాయి. దీనికి ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా ఏదోక రూపంలో మందు కనుక్కోవాలి అని భావిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: