క‌రోనా క‌ట్ట‌డికి ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో అమ‌లవుతున్నవ‌న్నీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చైనాలో ఇంత‌కు ముందు పాటించిన‌వే. అయితే లాక్‌డౌన్ కూడా చైనా నుంచే ప్ర‌పంచ దేశాలు నేర్చుకున్నాయి. అయితే చైనాలో వేగంగా విస్త‌రించిన ఈ వ్యాధిని..ఆదేశ ప్ర‌జ‌ల క్ర‌మ‌శిక్ష‌ణ‌..దేశంలో ఉన్న అత్యాధునిక‌మైన సాంకేతిక‌, వైద్య ప‌రిజ్ఞానం, స‌దుపాయాలు ఇవ‌న్నీ కూడా క‌రోనా మ‌హ‌మ్మా రిని అంతే వేగంతో త‌రిమేశాయి. అయితే చైనా నుంచి క‌రోనాను దిగుమ‌తి చేసుకున్న చాలా దేశాల్లో క్ర‌మ‌శిక్ష‌ణ లేదు. అమెరికాలో ఇప్ప‌టికీ చాలా రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. విమాన స‌ర్వీసులు కొన‌సాగుతున్నాయి.

 

 ఈ ప‌రిణామాల‌తో యూనిటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక ప్ర‌దేశం నుంచి మ‌రో కొత్త ప్ర‌దేశానికి క‌రోనా ఎగుమ‌తి..దిగుమ‌తి అవుతూ క‌రోనా క‌ట్ట‌డికి అవ‌కాశం లేకుండా త‌మ‌గొయ్యి తామే అమెరికన్లు తీసుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఆ దేశానికి చెందిన చాలా మంది ప్ర‌ముఖులు కూడా భార‌త్‌ను స్ఫూర్తిగా తీసుకుని యూఎస్ఏ మొత్తం లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని కోరుతున్నారు. ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే క‌రోనా మ‌హ‌మ్మారిని చైనా క‌ట్ట‌డి చేసిన విధానాల‌పై అధ్య‌య‌నం చేస్తోంది. ఇప్ప‌టికే లాక్‌డౌన్‌ను అమ‌ల్లోకి తెచ్చి..చాలా వ‌ర‌కు క‌రోనాను క‌ట్ట‌డి చేసింద‌నే చెప్పాలి.

 

అయితే ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు దెబ్బతిన‌డం, నిరుద్యోగం ప్ర‌బ‌లే అవ‌కాశం ఉండ‌టంతో లాక్‌డౌన్ ఎత్తివేయాల‌ని యోచిస్తోంది. ఇందుకు కూడా చైనా అమ‌లు చేసిన బ‌ఫ‌ర్ జోన్ల విధానాన్ని పాటించాల‌ని భావిస్తోంది. ఎక్క‌డ‌యితే కేసులు న‌మోద‌వుతు న్నాయో..నమోద‌య్యే అవ‌కాశం ఉందో ఆయా ప్రాంతాల్లో మాత్రం నిర్బంధాలు కొన‌సాగుతాయి. మిగ‌తా ప్రాంతాలు క‌రోనా ఫ్రీగా మారుతాయి. నిత్యావ‌స‌ర‌, అత్య‌వ‌స‌ర‌, జ‌న స‌మ్మ‌ర్ధం ఎక్కువ‌గా అవ‌స‌రం క‌ల‌గ‌ని కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తులిస్తారు. ద‌శ‌ల వారీగా లాక్‌డౌన్‌ను భార‌త్ ఎత్తివేయాల‌ని భావిస్తోంది. చైనాలో ఇదీ స‌క్సెస్ అయిన వ్యూహ‌మే ఇది. ఇప్పుడు భార‌త్‌లోనూ అమ‌లు చేసి విజ‌యం సాధించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: