ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం తెలంగాణ సీఎం కేసీఆర్ నైజం అంటారు.  అందుకే ఆయన తెలంగాణ పోరాట యోదుడు అయ్యారు.  తన ప్రాణాలు అర్పించడానికైనా సిద్ద పడి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత అయ్యారు.   ప్రస్తుతం తెలంగాణలో రెండవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న కేసీఆర్ నిన్న మీడియా సమావేశంలో కరోనా గురించి మాట్లాడిన విషయం తెలిసిందే.  భారత్ లో జూన్‌ 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. లాక్ డౌనే కరోనా మహమ్మారిపై పోరాడడానికి మన దగ్గర ఉన్న ఆయుధమని సీఎం కేసీఆర్ అన్నారు.

 

ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసినట్టు సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. లాక్ డాన్ పొడిగించాలన్న విషయం ప్రస్తావించారు.   తాజాగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్  స్పందిస్తూ.. ప్రధానమంత్రికి ఇలాంటి ఆలోచనాత్మక విజ్ఞప్తి చేసే ధైర్యం మారే నాయకుడికి లేదని కొనియాడారు. ఆర్థిక వ్యవస్థను మళ్ళీ దారిలోకి తెచుకోగలం.. కానీ, పోయిన ప్రాణాలను మళ్ళీ తిరిగి పొందలేమని సంతోష్ కుమార్ ట్విట్టర్ లో తెలిపారు.  ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, పారిశుద్ధ కార్మికులకు సీఎం కేసీఆర్ కరోనా బోనస్ ప్రకటించారు.

 

 

వైద్య సిబ్బంది సేవలకు గుర్తించి.. వాళ్ల గ్రాస్ శాలరీలో 10 శాతం సీఎం గిఫ్ట్ రూపంలో బోనస్‌గా అందజేస్తున్నామని.. ఈ మొత్తాన్ని వెంటనే అందజేస్తామని తెలిపారు. అంతే కాదు  లాక్ డౌన్ నేపథ్యంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు. వారి ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడటంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని.. వారికి అందరూ సెల్యూట్ చేస్తున్నారని అన్నారు.

 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: