ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా పేరు మాత్రమే వినిపిస్తుంది. చైనాలో పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ కరోనా ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టిస్తుంది.  మానవాళి మనుగడనే ప్రశ్నిస్తుంది.. అనుబాంబుల కన్నా ప్రమాదకరంగా మారింది.  కరోనా వైరస్ ఇప్పటి 205 దేశాలకు వ్యాప్తి చెందింది.  ప్రస్తుతం అమెరికాలో మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తోంది. దాని దెబ్బకు అమెరికాలో ప్రతీ రెండున్నర నిమిషాలకు ఓ మరణం సంభవిస్తోంది. ఇక న్యూయార్క్‌లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 10 వేల మందికిపైగా మృత్యువాత పడగా, ఒక్క న్యూయార్క్‌లోనే 4,758 మంది మృతి చెందారు.  

 

దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే ఏకంగా 594 మంది మృతి చెందారు. మరోపక్క, ఇటలీ, స్పెయిన్‌లలో గత వారం రోజులుగా మరణాల రేటు తగ్గుతుండడం కొంత ఊరటనిచ్చే అంశం. ఇక  ఏప్రిల్ 7న 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం'  ప్రజలు మెరుగైన ఆరోగ్యంతో జీవించాలనేది ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.  అయితే ప్రపంచ పరిస్థితి ఇప్పుడు చిన్నాభిన్నంగా తయారైన విషయం తెలిసిందే.  ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకోవడానికి ఓ ప్రత్యేకత ఉంది.

 

1948లో ఇదేరోజున ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 'ప్రపంచ ఆరోగ్యసంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్)' ఏర్పాటైంది. దీని వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 1950 నుంచి ఏప్రిల్ 7న 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' నిర్వహిస్తున్నారు.  సంపదలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే నిండు సున్నా..! ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు.  అయితే త్వరలో ఈ కరోనా మహమ్మారి అంతరించి పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: