దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారి చేస్తున్న బిభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా రోజు రోజుకీ ఈ కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతూనే ఉంది.  తాజాగా  హైదరాబాద్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.  సైఫాబాద్ పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.  ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో పాలీసులు, వైద్యులు, పారిశుద్ద్య సిబ్బంది మాత్రమే బయట ఉంటున్నారు.

 

అత్యవసర వస్తువులు అవసరం అయితేనే జనాలు బయటకు రావాలని ఆంక్షలు ఉన్నాయి. అయితే సైఫాబాద్ పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌ పాజీటీవ్ కేసు వచ్చిందని తెలియగానే..  ఆ స్టేషన్లో పని చేసే 12 మంది సిబ్బందిని క్వారంటైన్‌కి పంపారు.అయితే బాధితుడికి ట్రావెల్ హిస్టరీ లేదు.  అంతే కాదు ఈ మద్య కాలంలో ఎక్కడా ప్రయాణించిన దాఖలాలు కూడా లేవని తేలింది.  

 

ఇప్పటి వరకు ప్రజలకు సేవ చేస్తూ వస్తున్న పోలీసులు ఎన్నో జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.  హైదరాబాద్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో, పని చేసే హెడ్ కానిస్టేబుల్‌కు పాజిటివ్ రావడంతో మొత్తం తెలంగాణ పోలీసు విభాగం అప్రమత్తమైంది. ఆ మద్య  భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో డీఎస్పీగా పని చేసే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన కుమారుడు లండన్ నుంచి తిరిగి రాగా.. కొడుకు నుంచి సదరు అధికారికి ఇన్ఫెక్షన్ సోకింది. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: