ప్రస్తుతం ప్రపంచాన్ని కాపాడుతుంది సైనికులు కాదు.. వైద్యులు.. కరోనా విపత్తు కాలకూట విషాన్ని చిమ్ముతున్న వేల ప్రతి ఒక్క డాక్టరు తమ భుజాలపై అతి పెద్ద భారాన్ని మోస్తున్నారు.. ఒక డాక్టర్లే కాదు.. వైద్య సిబ్బంది అందరు కూడా దైవాలుగా మారి కరోనా అనే రక్కసితో మహా యుద్ధం చేస్తున్నారు.. ఇలాంటి పరిస్దితుల్లో పూజింప వలసిన డాక్టర్ల పై పాకిస్తాన్‌లోని బలుచిస్తాన్‌ రాష్ట్ర ప్రభుత్వం లాఠీఛార్జ్‌ చేసిందట.. ఈ విషయాన్ని క్వెట్టా పట్టణ పోలీస్‌ సీనియర్‌ అధికారి అబ్దుల్‌ రజాక్‌ మీడియాకు తెలిపారు.. ఇక విషయం ఏంటంటే..

 

 

ఈ దేశంలో ‘కరోనా వార్డులకు వెళ్లి రోగులకు చికిత్స చేసే డాక్టర్లకు, ఇతర వైద్యసిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్ల కొరత ఉంది. మా​స్కులు, గ్లౌజులు, చేతి తొడుగులు, పూర్థిస్థాయి గౌనులు అందుబాటులో లేవు. ఈ PPE కిట్లను అందించాలని గత కొన్ని వారాలుగా ప్రభుత్నాన్ని అక్కడి వైద్యులు కోరుతున్నారట.. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆస్పత్రి ముందు నిరసన తెలపగా, పోలీసులు అడ్డుకొని లాఠీఛార్జ్‌ చేసి అరెస్ట్‌ చేశారు’ అని క్వెట్టా పట్టణ డాక్టర్ల సమాఖ్య అధ్యక్షుడు యాసీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

అయితే అక్కడి ప్రభుత్వ వాదన మాత్రం మరోలా ఉంది.. అదేమంటే ‘పీపీఈ కిట్ల కొరత ఉన్నది నిజమే, అయితే కిట్ల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానీ డాక్టర్లు, వైద్యసిబ్బంది ఓపిక పట్టకుండా నిరసన చేపట్టారు. 144 సెక్షన్‌ను ఉల్లంఘించారు. అందుకే ఆరెస్ట్‌ చేశాం’అని బలుచిస్తాన్‌ ప్రభుత్వం పేర్కొంది. ఇక ఏది ఏమైనా ఇలాంటి సమయంలో వైద్యసిబ్బంది ప్రతి దేశానికి అత్యవసరం కానీ ఇక్కడి ప్రభుత్వం వారిని రక్షించవలసింది పోయి డాక్టర్లపై లాఠీచార్జ్‌, అరెస్ట్‌ చేయడం దారుణమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: