మనిషి ఆలోచనలకు కార్య రూపం ఇచ్చే కర్మాగారమే సృజనాత్మకత. మన కోరికలు మన లక్ష్యాలు అన్నీ నెరవేరాలి అంటే డబ్బు కావాలి. అయితే అలాంటి డబ్బు గణించే అవకాశం ఒక్క సృజనాత్మకత వలెనే వస్తుంది. ఈ సృజనాత్మకత కు పర్యాయ పదంగా చాలామంది ఊహాశక్తి పదాన్ని కూడ వాడుతూ ఉంటారు.


అయితే ఊహాశక్తి ఉన్న ప్రతివ్యక్తికి సృజనాత్మకత ఉండదు. మన మనసులో ఆలోచించే ఆలోచనలు క్రియా రూపం దాల్చడమే సృజనాత్మకత. ఊహాశక్తి వల్ల సృజనాత్మకత పెరుగుతుంది కానీ కేవలం ఊహలతోనే ఎవరు రాణించలేరు. ఊహాశక్తి తో కవులు కళాకారులు రచయితలుగా రాణించవచ్చు కాని వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాలలో రాణించాలి అంటే ఊహాశక్తి తో పాటు సృజనాత్మకత కూడ ఉండాలి.


డబ్బు సంపాదన అన్నది ఒక ప్రగాఢ వాంఛ అయితే ఈ వాంఛ ప్రతి వ్యక్తికి ఉన్నా అది అస్పష్టంగా ఉండటంతో ఆ వాంఛను భౌతిక రూపంలో మార్చాలి అంటే ప్రతివ్యక్తికి సృజనాత్మక ఉండాలి. పరిమిత శక్తితో ఒక వ్యక్తిని ధనవంతుడుగా మార్చగల శక్తి కేవలం ఒక సృజనాత్మకతకు మాత్రమే ఉంటుంది. అందుకే సంపదకు మూలం ఆలోచనలు అంటారు. ఈ ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉండటమే కాకుండా ఆ ఆలోచనలకు తగ్గట్టుగా తన భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకునే విషయంలో ఒక వ్యక్తి సృజనాత్మకత కీలకంగా పనిచేస్తుంది.


సంపదను సృష్టించాలి అంటే కొన్ని సుస్థిరమైన సూత్రాల సహాయం తీసుకోవాలి. అయితే ఆ సుస్థిరమైన సూత్రాలు ప్రతి వ్యక్తికి ఒకేలా ఉండవు. ఈ సూత్రాలను మనకు మనం తెలుసుకుని వాటిని విశ్లేషించు కోవడంలో సృజనాత్మకత అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సంపన్న వంతులుగా కీర్తి గణించిన వ్యక్తులు అందరు అందరికీ తెలిసిన వ్యాపారాలు చేసినా ఆ వ్యాపారాలలో చాల విభిన్నంగా వ్యవహరిస్తూ ప్రతి విషయంలోను తమ సృజనాత్మకతను చూపించిన వ్యక్తులు కావడంతో టాటా ల నుండి అంబానీల వరకు తరతరాల వ్యాపార రంగంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ ఎవరు అందుకోలేని స్థాయిలో కొనసాగుతూ ఉండటానికి గల కారణం వారిలోని సృజనాత్మకత మాత్రమే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: