తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. సోమ‌వారం మ‌ళ్లీ 30 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో  ఇప్ప‌టి వ‌ర‌కు న‌మో దైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 364కు చేరింది. అందులో ఎక్కువ మంది ఢిల్లీ మ‌ర్క‌జ్‌తో సంబంధం ఉన్న వారే కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. న మోదైన అన్ని కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 45 మంది కోలుకొని ద‌వాఖాన‌ల నుంచి డిశ్చార్జి అయ్యారు.  ప్ర‌స్తుతం 308 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు అ త్య‌ధికంగా హైద‌రాబాద్ నుంచే 161 మందికి పాజిటివ్ నిర్ధార‌ణ అవ‌డం గ‌మ‌నార్హం.  దీంతో  క‌రోనా క‌ట్ట‌డిపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించింది. హా ట్‌స్పాట్‌గా గుర్తించిన ప్ర‌దేశాల‌పై పోలీసులు ప్ర‌త్యేక నిఘా కొన‌సాగిస్తున్నారు. క‌రోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌ను పూర్తిగా నివారిస్తున్నారు. క‌రోనా సోకిన వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి, ద‌వాఖాన‌కు త‌ర‌లిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: