వరంగల్ మ‌హా నగరంలో కరోనా క‌ల‌క‌లం రేపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో అధికారులు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.  వైరస్ వ్యాప్తి  నియంత్రణకు  15  ప్రాంతాల్లో నో మూమెంట్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. 15  ఏరియాల్లో 25 టీమ్‌లు, 67 కాలనీల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయి.  26 మొబైల్ వాహనాల ద్వారా 41 783 క్వారంటైన్ ఇళ్లకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు పంపుతున్నారు. టీమ్‌లోని ఒక వార్డుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్, సూపర్‌వైజర్‌కు బాధ్యతలు అప్పగించారు. వరంగల్‌లో నెల‌కొన్న పరిస్థితిపై మ‌ధ్యాహ్నం మేయర్, కమిషనర్ మీడియా సమావేశం ని ర్వహించనున్నారు. ఇదిలా ఉంటే క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోనూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య   పెరుగు తోంది. ఢిల్లీ నిజాముద్దీన్‌, మ‌ర్క‌జ్ ఉద‌తంతో నే ఒక్క‌సారిగా ప్ర‌శాంతత  చెదిరింది.  ఐదు రోజుల వ్య‌వ‌ధిలోనే క‌రోనా కేసులు ఒక్క‌టొక్క‌టిగా 32కు చేర‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  మ‌రోప‌క్క పోలీసులు లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ప్ర‌జ‌లు ఎట్టి ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు రావొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: